Viral video: విజయ్ దేవరకొండ స్పెషల్ ఫ్యాన్.. అక్కడ టాటు వేయించుకున్న అమ్మాయి..!

సినిమా హీరోలకు ఫ్యాన్స్ ఉండటం మామూలు విషయమే.. అయితే కొంతమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. వీళ్లు తమ హీరోపై అభిమానాన్ని రకరకాలుగా చాటుకుంటూ ఉంటారు. ఆ హీరోలు కూడా వారి అభిమానం చూసి ఎమోషనల్ అవుతుంటారు. తాజాగా ఓ అమ్మాయి హీరో విజయదేవరకొండపై ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంది.. తన వీపుపై విజయ్ దేవరకొండ ఫొటోను టాటూగా వేయించుకుంది. ఆ యువతి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

చెర్రీ, సోనాలి అనే ఇద్దరు అమ్మాయిలు తమ అభిమాన హీరో విజయ్ దేవరకొండను కలిశారు. ఆ ఇద్దరితో విజయ్ సరదాగా మాట్లాడారు. కలిసి ఫొటోలు దిగాడు. తమ అభిమాన హీరో తనతో మాట్లాడుతూ ఉంటే ఆమెకు కనీసం మాటలు రాలేదు. విజయ్ దేవరకొండ అక్కడే ఉన్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నటి ఛార్మిని పరిచయం చేశాడు.. ఈక్రమంతో చెర్రీ తన వీపుపై వేయించుకున్న విజయ్ దేవరకొండ టాటూను చూపించింది. దీంతో విజయ్ దేవరకొండ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం దీని వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

Leave a Comment