రోడ్ సైడ్ టీస్టాల్ లో టీ తాగిన విజయ్ దేవరకొండ..!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఎంత సింపుల్ గా ఉంటారో అందరికీ తెలసిందే. ఇటీవల ముంబైలో జరిగిన లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ఆయన చాలా సింపుల్ గా వచ్చారు.. తాజాగా ఆయన నటిస్తున్న లైగర్  సినిమా పాన్ ఇండియాగా రాబోతుండంతో సినిమా యూనిట్ అంతా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా బిహార్ లోని పట్నాలో ఉంది లైగర్ టీమ్.. ఈక్రమంలో అక్కడ ఓ రోడ్ సైడ్ టీస్టాల్ లో విజయ్ దేవరకొండ టీ తాగారు..

పట్నాలో రోడ్డు పక్కన ‘గ్రాడ్యుయేట్ చాయ్ వాలి’ పేరుతో ఓ టీస్టాల్ ఏర్పాటు చేశారు కొందరు యువత.. ఆ టీస్టాల్ లో విజయ్ దేవరకొండ సందడి చేశారు. టీస్టాల్ నిర్వాహకులతో సెల్ఫీలు దిగారు. అనంతరం అక్కడి టీ రుచి చూశారు. విజయ్ దేవరకొండ వారి టీ టేస్ట్ చేయడంతో టీస్టాల్ నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

కాగా, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ‘లైగర్’ సినిమాలో బాక్సింగ్ చాంపియన్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కరణ్ జోహార్, చార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కింది.. ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.. 

Leave a Comment