వీడియో వైరల్: చెప్పులు అమ్మే వ్యక్తితో సోనూసూద్ బేరాలు

కరోనా కష్టకాలంలో సోనూసూద్ ఎంతో మందిని ఆదుకుని రియల్ హీరో అనిపించుకున్నారు. దీంతో ప్రజలు సోనూసూద్ ని దేవుడిగా కొలుస్తున్నారు. సోనూసూద్ కూడా సామాన్య ప్రజలతో ఎప్పుడు మమేకమై ఉంటారు. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా సోనూసూద్ యాక్టివ్ గా ఉంటారు. 

తాజాగా సోనూసూద్ చెప్పులు అమ్మే వ్యక్తితో బేరం ఆడిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇటీవల సోనూసూద్ షూటింగ్ నిమిత్తం జమ్మూకశ్మీర్ వెళ్లాడు.  శ్రీనగర్ లోని బట్ మలూ బజార్ లో షమీమ్ ఖాన్ అనే చెప్పులు అమ్మే వ్యక్తితో సోనూసూద్ మాట్లాడారు. ఆయన దుకాణంలో చెప్పుల రేట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.   

పిల్లల చెప్పులు రూ.50, పెద్దల చెప్పులు రూ.120 అని షమీమ్ ఖాన్ అన్నాడు. రూ.120ల చెప్పులు రూ.50కి ఇమ్మని సోనూసూద్ అడగ్గా, ఆ రేటుకు వేరే చెప్పులు వస్తాయని ఆ దుకాణదారుడు చెప్పాడు. సోనూసూద్ చెప్పులపై డిస్కౌంట్ అడగ్గా, దానికి ఆ దుకాణాదారుడు అంగీకరిస్తాడు. సోనూసూద్ పేరుపై 20 శాతం డిస్కౌంట్ ఇస్తానని చెప్పాడు. చెప్పులు కొనాలనుకునే వారు షమీమ్ షాపును సందర్శించండి.. నా పేరుపై డిస్కౌంట్ పొందండి.. అంటూ ఇన్ స్టాగ్రామ్ లో వీడియో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

 

 

View this post on Instagram

 

A post shared by Sonu Sood (@sonu_sood)

Leave a Comment