నో గూగుల్ పే, నో ఫోన్ పే… డైరెక్టర్ పోకెట్ పే..!

సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానాలు విధిస్తారు. ఇక కొంత మంది అయితే జరిమానాలు తీసుకోకుండా ఎంతో కొంత తీసుకుని వదిలేస్తారు. ఈ మధ్య అయితే కొత్తగా డిజిటల్ పేమెంట్లు రావడంతో ఆ రూపంలో లంచం తీసుకుంటున్నారు. 

అయితే ఈ ట్రాఫిక్ పోలీస్ ఇంకా అప్ డేట్ అయినట్లు లేదు. కొత్త మార్గంలో లంచం తీసుకుంటూ కెమెరాకు చిక్కింది. మహారాష్ట్రలోని పిపిరీలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాలు నడుపుతున్న వారికి జరిమానాలు విధిస్తున్నారు. 

ఈ సందర్భంగా అక్కడ డ్యూటీ చేస్తున్న మహిళ కానిస్టేబుల్ ఓ యువతితో బేరం కుదుర్చుకుంది. వాహనానికి జరిమానా విధించకుండా కొంత మొత్తాన్ని డిమాండ్ చేసింది. దానికి ఆ యువతి కూడా రెడీ అయింది. అయితే ఆ మహిళా కానిస్టేబుల్ ఆ లంచాన్ని నేరుగా తీసుకోలేదు. తన బ్యాక్ పాకెట్లో పెట్టాలని చెప్పింది. దీంతో ఆ యువతి డబ్బును  కానిస్టేబుల్ బ్యాక్ పాకెట్లో పెట్టింది. 

ఈ తతంగం మొత్తాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘నో గూగుల్ పే, నో ఫోన్ పే, డైరెక్టర్ పోకెట్ పే’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   

 

Leave a Comment