జాతీయ జెండా ముట్టుకోని జై షా.. వీడియో వైరల్..!

ఆసియా కప్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ని చూసేందుకు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా కూడా వచ్చారు. భారత జట్టు విజయం తర్వాత ఆయన చప్పట్లు కొడుతూ అభినందిస్తున్నారు. ఇంతలో పక్కనే నిల్చున్న వ్యక్తి జాతీయ జెండాను అందజేసేందుకు ప్రయత్నించగా, తీసుకునేందుకు జైషా నిరాకరించారు. 

ఈ వీడియోపై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జైషా ఇలా ప్రవర్తించడంపై భారత అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ఇక ఆయన తండ్రి అమిత్ షా ప్రత్యర్థులైతే ఏకీ పారేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి కొడుకు దేశభక్తి ఇదేనా అంటూ విమర్శలు చేస్తున్నారు. ‘దేశ ద్రోహులు..దేశానిది తింటారు.. జాతియ జెండాను ముట్టుకోరు’, ‘త్రివర్ణ పతాకంపై ఇంత ద్వేషమా?’ అంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.  

ఇదే పనిని పొరపాటున ఒక ప్రతిపక్ష నేత ఎవరైనా చేసి ఉంటే ఈ పాటికి దేశద్రోహిగా ప్రకటించేవారు.. అదే ఎవరైనా మహ్మద్ పేరుగల వ్యక్తి చేసి ఉంటే. దేశ నలుమూలల ఎఫ్ఐఆర్ నమోదయ్యేవని, బుల్డోజర్లు అతని ముందు ఉండేవని జర్నలిస్ట్ రణ్ విజయ్ సింగ్ పేర్కొన్నారు. అదే సమయంలో కొందరు మాత్రం జై షా పనిని సమర్థిస్తున్నారు.  జై  షా ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడని, అందుకే అతను ప్రోటోకాల్‌ను అనుసరిస్తున్నాడని చెప్పుకొచ్చారు. 

Leave a Comment