‘శ్రీకారం’ సినిమాకు ఉపరాష్ట్రపతి ప్రశంసలు..!

శర్వానంద్ హీరోగా దర్శకుడు బి.కిశోర్ రూపొందించిన సినిమా శ్రీకారం.. వ్యవసాయం, రైతు యొక్క గొప్పతనాన్ని తెరపై చక్కగా చూపంచాడు దర్శకుడు కిశోర్.. కష్టపడి పనిచేసి పంటను పండించిన రైతు.. తన పంటను అమ్ముకోలేక ఎంతటి కష్టాలు పడుతాడో ఈ సినిమా చూపించారు. చదువుకున్న యువకుడు వ్యవసాయం చేస్తే ఎంత లాభం ఉంటుందో తెలిపాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంకా అరుళ్ మోహన్ నటించింది.

 ఇక శివరాత్రి కానుకగా విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా శ్రీకారం చిత్రంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. ‘వ్యవసాయ పునర్వైభవం కోసం గ్రామాలకు మరలండి అనే స్ఫూర్తిని యువతలో రేకెత్తించే విధంగా తెరకెక్కించిన శ్రీకారం చక్కని చిత్రం. కుటుంబం, ఊరు అందరూ కలిసి ఉంటే సాధించలేనిది ఏదీ లేదనే చక్కని సందేశాన్ని అందించిన చిత్ర దర్శక నిర్మాతలు, నటీనటులకు శుభాకాంక్షలు. అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామాలకు అందించి, వ్యవసాయంతో జోడించి, పరస్పర సహకారంతో ఆత్మవిశ్వాసంతో అన్నదాత ముందుకు వెళ్లవచ్చు అన్న సందేశాన్ని శ్రీకారం అందిస్తోంది. యువత చూడదగిన చక్కని చిత్రం.’ అంటూ వెంకయ్యనాయుడు ప్రశంసించారు.  

Leave a Comment