సీఏఏ ప్రొటెస్టర్ల వెన్యూ మార్పు..!

సీఏఏకు నిరసనగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ లో నెల రోజులుకు పైగా ధర్నా చేస్తున్న ఆందోళనకారులు తన వెన్యూను షాహీన్ బాగ్ నుంచి ఈశాన్య ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రోకు మర్చారు. చేతిలో జాతీయ పతాకాలను చేతబట్టుకుని ‘ఆజాదీ’ కావాలని నినాదాలు చేస్తూ తమ నిరసను ఉధృతం చేశారు. అనేక మంది మహిళలు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వీరి నిరసన కారణంగా ఆదివారం ఉదయం మెట్రో స్టేషన్ ను తాత్కాలికంగా మూసివేశారు. రోడ్డుపై ట్రాఫిక్ ను ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు పోలీసులు నిరసనకారులతో చర్చలు ప్రారంభించారు. వారు రోడ్డును బ్లాక్ చేయడం సరికాదని సీనియర్ పోలీసు అధికారి వేద్ ప్రకాష్ సూర్య అంటున్నారు. ఎందుకైనా మంచిదని పారా మిలిటరీ బలగాలను కూడా రప్పించినట్లు ఆయన తెలిపారు. ఇలా ఉండగా, ప్రభుత్వ ఉద్యోగాలకు, ప్రమోషన్లకు కోటాలు, రిజర్వేషన్లు కల్పించడం ప్రాథమిక హక్కు కాదని ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు నిరసనగా దేశవ్యాప్త సమ్మె చేయాలంటూ భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఇచ్చిన పిలుపునకు ఈ ఆందోళనకారులంతా సమర్థిస్తున్నారు. 

Leave a Comment