ఏపీలో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పెంపు..!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలపై విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను పెంచింది. ఈ మేరకు పెట్రోల్ ధరపై రూ.1.24, డీజిల్ ధరపై 93 పైసలు వ్యాట్ పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

పెట్రోల్ పై 31 శాతం పన్నుతో పాటు అదనంగా రూ.4, డీజిల్ పై 22.25 శాతం వ్యాట్ తో పాటు అదనంగా రూ.4 సుంకం విధించింది. కరోనా వల్ల ఆదాయం పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రానికి రూ.4,480 కోట్ల మేర రావాల్సిన రెవెన్యూ తగ్గిందని రెవెన్యూ శాఖ తెలిపింది. 

Leave a Comment