ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకాల ధరలు.. ఎంతంటే?

నూతన వ్యాక్సినేషన్ పాలసీ విధివిధానాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకాల ధరను కూడా నిర్ణయించింది. నిర్ధిష్ట ధర విధిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ధరలు:

కోవిషీల్డ్ – రూ.780

కోవాగ్జిన్ – రూ.1410

స్పుత్నిక్ – రూ.1145

5 శాతం జీఎస్టీ, రూ.150 సర్వీస్ ఛార్జీ అదనం

జీఎస్టీతో పాటు సర్వీస్ ఛార్జీ కూడా ఇందులో భాగమేనని కేంద్రం స్పష్టం చేసింది. అధిక ఛార్జీలు వసూలు చేసే ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దేశవ్యాప్తంగా 18 ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా టీకా పంపిణీ చేస్తామని ప్రకటించిన కేంద్రం.. ఉచితంగా వద్దనుకునేవారి కోసం 25 శాతం వ్యాక్సిన్ ను ప్రైవేట్ ఆస్పత్రులకు ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.. వ్యాక్సిన్ గరిష్ట ధరపై రూ.150 మాత్రమే సర్వీస్ ఛార్జి వసూలు చేయాలని ప్రధాని ఆదేశించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకాలకు ధరలను ఖరారు చేసింది..

Leave a Comment