ఈనెల 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా : ప్రధాని మోడీ

కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రధాని మోడీ మొదటి సారిగా జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశంలో ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ పై కీలక ప్రకటన చేశారు. ఈసందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగిస్తూ దేశంలోని రాష్ట్రాలు ఇక నుంచి వ్యాక్సిన్ల కోసం ఒక్కపైసా కూడా ఖర్చు పెట్టవద్దని అన్నారు. కేంద్ర ప్రభుత్వమే అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్లు సరఫరా చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరికి టీకా అందేలా కేంద్రమే చర్యలు తీసుకుంటుందన్నారు. 

జూన్ 21 నుంచి రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈనెల 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తుందన్నారు. దేశంలోని రాష్ట్రాలు ఒక్కపైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. 

కోవిడ్ టీకా కోసం ప్రైవేటు ఆస్పత్రులు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నాయని ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆస్పత్రులు టీకా కోసం రూ.150 కంటే ఎక్కువ తీసుకోవద్దని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 75 శాతం వ్యాక్సిన్ డోసులను కేంద్రం సరఫరా చేస్తుందని, 25 శాతం వ్యాక్సిన్ డోసులు ప్రైవేటు ఆస్పత్రులు కొనుగోలు చేయవచ్చని అన్నారు. దేశంలో నవంబర్ నాటికి 85 శాతం టీకా పంపిణీ పూర్తవుతుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.   

Leave a Comment