విదేశీ డిజిటల్ సర్వీసుల పన్నులపై భారత్ ను దర్యాప్తు చేస్తాం : ట్రంప్

విదేశీ డిజిటల్ సర్వీసుల పన్నులపై దర్యాప్తు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు బ్రిటన్, యూరోపియన్ యూనియన్ తో పాటు ఇండోనేషియా, టర్కీ మరియు భారతదేశంలో విదేశీ డిజిటల్ పన్నులపై దర్యాప్తు చేయాలని యోచిస్తున్నారు. తమ దేశ టెక్నాలజీ కంపెనీలను లక్ష్యంగా చేసుకోవడానికి రూపొందించిన పన్ను పథకాలను అవలంబిస్తున్నారని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. 

గతేడాది ఫ్రాన్స్ పై కూడా ట్రేడ్ దర్యాప్తు జరిగింది. మన ట్రేడింగ్ భాగస్వామ్య దేశాల్లో చాలా దేశాలు యూఎస్ కంపెనీలపై అనుచిత పన్నుల విధింపు మార్గాలను అనుసరిస్తున్నాయని అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ రాబర్ట్ లిథిజర్ ఆరోపించారు. తమ బిజినెస్, తమ సిబ్బందిని రక్షించుకునేందుకు అన్ని చర్యలూ తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నమన్నారు. 

ఆన్ లౌన్ అమ్మకాలు మరియు ప్రకటన నుంచి వచ్చే ఆదాయానికి పన్ను విధించే ప్రయత్నాలను అమెరికా వ్యతిరేకిస్తుంది. వారు గూగుల్, ఆపిల్, ఫేస్ బుక్, అమెజాన్ మరియు నెట్ ఫ్లిక్స్ వంటి యూఎస్ టెక్ దిగ్గజాలను ఒంటరి చేస్తున్నాయని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇండియాను కూడా ట్రంప్ టార్గెట్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Leave a Comment