‘ఉప్పెన’ ఫస్ట్ సాంగ్ ప్రోమో..

మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో పంజా వైష్ణవ తేజ్. మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తమ్ముడే ఈ వైష్ణవ్. ‘ఉప్పెన’ అలనే బ్యూటిఫుట్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ కుర్ర హీరో. ఈ సినిమాకు బుచ్చిబుబు దర్శకత్వం వహిస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ప్రోమోను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ప్రోమోలో దర్శకుడు బుచ్చిబాబు దేవీని ఓకే లవ్ సాంగ్ కావాలని అడగటం వెంటనే దేవీ ఒక క్యాచీ ట్యూన్ ని పాడి వినిపించారు. ఈ ట్యూన్ కు డైరెక్టర్ బుచ్చి బాబు వెంటనే ఓకే చెప్తాడు. లాస్ట్ లో ఈ పాటను సింగర్ జావేద్ అలీ స్టూడియోలో పాడుతున్నట్టుగా చూపించారు. ఈ పాట లిరికల్ వీడియో రేపు సాయంత్రం (మార్చి 2వ తేదీ 4.05 గంటలకు ) రిలీజ్ చేస్తారని వెల్లడించారు. 

Leave a Comment