గుప్త నిధుల కోసం కన్న కూతుర్ని చంపి.. ఇంట్లో పూడ్చాడు..!

ఉత్తరప్రదేశ్ లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ కసాయి తండ్రి గుప్త నిధుల కోసం కన్న కూతుర్ని పొట్టన పెట్టుకున్నాడు. వివరాల మేరకు ఉత్తరప్రదేశ్ బరబంకిలోని కుర్ద్ మావ్ గ్రామానికి చెందిన ఆలం గుప్త నిధుల మోజులో పడ్డాడు. ఈక్రమంలో ఓ మాంత్రికుడు ఆలం ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని, అవి ఎక్కడ ఉన్నాయో తెలియాలంటే పదేళ్ల ఆలం కూతురిపై కొన్ని పూజలు చేయాలని నమ్మబలికాడు. 

ఎలాగైన గుప్తనిధులు సొంతం చేసుకోవాలన్న ఆశతో ఆలం ఆ మాంత్రికుడి మాటలు నమ్మి తన కూతుర్ని కూర్చోబెట్టాడు. పూజలో భాగంగా ఆ చిన్నారిని తీవ్రంగా కొట్టాడు. కూతుర్ని కొడుతుండగా అడ్డువచ్చిన భార్యను కూడా కొట్టాడు. దీంతో తీవ్రగాయాలైన చిన్నారి మరణించింది. దీంతో ఏంచేయాలో తెలియక ఇంట్లోనే పూడ్చిపెట్టాడు. చిన్నారి అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.  

 

Leave a Comment