యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..సీబీఐకి హత్రాస్ కేసు..!

యూపీలోని హత్రాస్ లో 20 ఏళ్ల యువతిపై అత్యాచారం కేసు విషయంలో యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)కి అప్పగించింది. ఈ కేసును విచారాణ చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. అంతకుముందు యూపీ డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు బాధిత కుటుంబాన్ని కలిశారు.  యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

 హత్రాస్ కేసు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై దేశంలో సంచలనంగా మారింది. బాధితురాలి శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా అర్ధరాత్రి సమయంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈక్రమంలో దేశవ్యాప్తంగా నిరసనలు వస్తున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన సిట్ సీఎం యోగీకి శుక్రవారం నివేదిక సమర్పించింది. సిట్ సూచనల మేరకు జిల్లా ఎస్పీతో సహా ఐదుగురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. వారందరికీ నార్కో ఎనాలిసిస్, పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.  

Leave a Comment