బాలకృష్ణతో సినిమా చేయాలంటే నాకు భయం: రాజమౌళి

హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’లో ప్రసారమవుతున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’లో దర్శక ధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. షో సందర్భంగా బాలకృష్ణ దర్శకుడు రాజమౌళికి ఓ ప్రశ్న వేశారు. ఇప్పటి వరకు మన కాంబినేషన్ లో సినిమా రాలేదని, తన అభిమానులు బాలయ్యతో సినిమా ఎప్పుడు చేస్తారని మిమ్మల్ని అడిగితే.. బాలకృష్ణను నేను హ్యాండిల్ చేయలేనని అన్నారట ఎందుకు? అని రాజమౌళిని ప్రశ్నించారు.. 

ఈ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇస్తూ.. భయంతోనే అలా చెప్పానని అన్నారు. మీరు ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ చాలా పద్ధతిగా ఉంటారని, నేను సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఎలా ఉంటానో తనకు తెలియదని చెప్పారు. ఎవరైనా తనకు గుడ్ మార్నింగ్ చెబితే చిరాకని అన్నారు. షాట్ పెట్టుకుని పక్కన హీరో ఎండలో నిలబడ్డాడా.. వానలో నిలబడ్డాడా అనేది తాటు పట్టించుకోనని, తన ఫ్రేమ్ రెడీ అయ్యే వరకు హీరో కష్టసుఖాల గురించి ఆలోచించనని రాజమౌలి చెప్పారు. ఒక వేళ బాలకృష్ణతో డైరెక్ట్ చేయాల్సి వస్తే..ఆయనకు ఏమైనా కోపం వస్తుందేమోనని భయమని, తనకు అదే టెన్షన్ అని రాజమౌళి సమాధానం ఇచ్చారు.  

 

Leave a Comment