అండర్ గ్రౌండ్ రొమాన్స్ : ప్రియురాలి ఇంటి వరకు సొరంగం తవ్విన ప్రియుడు..!

తన ప్రియురాలిని కలిసుకునేందుకు ఓ వ్యక్తి ఆమె ఇంటి వరకు సొరంగం తవ్వేశాడు. ప్రియురాలి భర్త డ్యూటీకి వెళ్లిన తర్వాత సొరంగ మార్గం ద్వారా ఆమె ఇంటికి రావడం, ఆమెతో రాసలీలు సాగించడం చేేస్తున్నాడు. చివరికి ఆమె భర్తకు అడ్డంగా దొరికాడు. మెక్సికోలోని తైజావానాకు చెందిన కన్ స్ట్రక్షన్ వర్కర్ అల్బెర్టో.. తన ఇంటి నుంచి సమీపంలోని విల్లాస్ డెల్ ప్రాడో ప్రాంతానికి రహస్య మార్గం సృష్టించాడు.

చాలా రోజులుగా ఆ సొరంగ మార్గం ద్వారా వెళ్లూ ప్రియురాలు పమేలాతో రహస్యంగా రాసలీలు కొనసాగించాడు. అయితే ఓ రోజు అనుకోకుండా పమేలా భర్త త్వరగా ఇంటికి వచ్చాడు. ఇంట్లో వచ్చిన భర్త, ఇంట్లో జరుగుతున్నా తతంగం చూసి షాక్ అయ్యాడు. అయితే, అక్కడి ునంచి తప్పించుకున్న ప్రియుడు గదిలోని సోఫా వెనక్కి వెళ్లి మాయం అయ్యాడు. 

భర్త కూడా సోఫా వెనక్కి వెళ్లి చూడగా అక్కడ ఓ సొరంగం కనిపిచింది. అందులో నుంచి లోపలికి వెళ్లిన భర్తకు షాకింగ్ విషయం తెలిసింది. ప్రియుడి ఇంటి వరకు సొరంగం ఉన్నట్లు గుర్తించాడు. సొరంగం నేరుగా ప్రియుడి ఇంట్లోకి ఉంది. దీంతో ప్రియుడిపైన, అతని భార్యపైన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసున్నారు. ప్రస్తుతం ఈ సొరంగానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

Leave a Comment