గోదావరి నదిలో ఇద్దరు పిల్లల్ని కోల్పోయిన దంపతులకు రెండేళ్ల తర్వాత అదే రోజు కవలలు పుట్టారు..!

అసలు కొన్ని సంఘటనలు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. ఇది కాకతాళీయమో లేక అద్భుతమో తెలీదు కానీ ఓ దంపతులు తమ బిడ్డల్ని కోల్పోయిన రెండేళ్లకు అదే రోజున కవలలు పుట్టారు. ఇది ఆ దంపతుల జీవితంలో అద్భుతమనే చెప్పాలి. వివరాల్లోకి వెళ్తే.. 2019 సెప్టెంబర్ 15న గోదావరి నదిలో విషాదం జరిగిన విషయం తెలిసిందే.. ఆ ప్రమాదంలో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజమండ్రి నుంచి భద్రాచలం బయలుదేరిన రాయల్ వశిష్ట బోటు దేవీపట్నం మండలం కచ్చులూరు గ్రామానికి సమీపంలో బోటు మునిగింది. 

ఈ బోటులో ఆరిలోవకు చెందిన తలారి అప్పలరాజు, భార్య భాగ్యలక్ష్మి, వారి కుమార్తెలు గీతా వైష్ణవి(3), ధాత్రి అనన్య(1)తో పాటు మరో ఏగుడురు కుటుంబ సభ్యులు ఈ బోటులో ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో అప్పలరాజు, భాగ్యలక్ష్మి దంపతులు తప్ప కుమార్తెలతో సహా అందరూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ దంపతులు గర్భకోశంతో తల్లడిల్లిపోయారు. 

ఈ దంపతులకు పిల్లలు లేకపోవడంతో మళ్లీ పిల్లలు కావాలనుకున్నారు. కానీ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భాగ్యలక్ష్మి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. దీంతో తమకు పిల్లలు పట్టరని కృంగిపోయారు. తర్వత వైద్యులను సంప్రదిస్తే కృత్రిమ గర్భధారణ విధానంలో పిల్లలు పుట్టే అవకాశం ఉందని చెప్పారు. విశాఖలోని పద్మశ్రీ ఆస్పత్రిని సంప్రదించి పిల్లల కోసం ప్రయత్నించారు. ఇద్దరు పిల్లలు చనిపోయిన రోజు సెప్టెంబర్ 15న వీరికి కవల పిల్లలు జన్మించారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇది వైద్య చరిత్రలో అపురూప ఘట్టం అనే చెప్పొచ్చు.. 

Leave a Comment