ఇండియాపై ట్రంప్ విమర్శలు..!

అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై విమర్శలు చేశారు. చైనా, రష్యాలతో కలిసి భారత్ ప్రపంచ పర్యావరణానికి విఘాతం కలిగిస్తోందని విమర్శలు చేశారు. నార్త్ కరోలినాలో ఎన్నికల ర్యాలీలో ట్రంప్ ప్రసంగించారు. తన హయాంలో అమెరికా ఇంధన స్వయం సంవృద్ది సాధించిందని పేర్కొన్నారు. ఇండియా, చైనా, రష్యాలు వాయు కాలుష్యాన్ని పెంచుతున్నాయని ఆరోపించారు. ఇక అమెరికాలో పర్యావరణ, ఓజోన్ ఇతర గణాంకాలు బాగున్నాయన్నారు. 

కాగా, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పారీస్ డీల్ నుంచి అమెరికా 2017లో వైదొలగింది. ఈ డీల్ తో తమకు కోట్లాది డాలర్లు ఖర్చు అవుతాయని అప్పట్లో ట్రంప్ విమర్శించారు. అయితే పర్యావరణనానికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు ట్రంప్ చైనాను, భారత్ ను విమర్శిస్తూనే ఉన్నారు. పారీస్ డీల్ తో భారత్, చైనా దేశాలకు మేలు జరుగుతుందని, అమెరికాకు ఎలాంటి ఉపయోగం లేదని ఆయన విమర్శించారు. ఇక ప్లాస్టిక్ వాడకం తగ్గించి పేపర్ వాడకం జరపాలన్న వాదనను ట్రంప్ ఎద్దేవా చేశారు.  

Leave a Comment