‘నూనె మొక్కు’.. 2.5 కిలోల నూనె తాగిన మహిళ..!

ప్రతి ఏటా పుష్య మాసంలో ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ లో జరిగే ఖాందేవ్ జాతరలో తొడసం వంశీయుల ఆడపడుచులు నూనె మొక్కు చెల్లించుకోవడం ఆనవాయితీ.. జాతరలో భాగంగా ఖాందేవ్ ఆలయంలో ఓ ఆదివాసీ మహిళ మంగళవారం నూనె మొక్కు చెల్లించుకుంది. తొడసం వంశీయుల సమక్షంలో మట్టిపాత్రలో 2.5 కిలోల నువ్వుల నూనెను ఒకేసారి తాగేసింది. 

ఈ జాతరకు ఆదివాసీలు ఖాందేవ్ ఆలయానికి పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో మహాపూజ చేశారు. తర్వాత తొడసం వంశీయుల ఆడపడచు యోత్మభాయి నూనె మొక్కు చెల్లించుకుంది. తొడసం వంశీంలోని ప్రతిఇంటి నుంచి తీసుకొచ్చిన నువ్వుల నూనెను మట్టిపాత్రలో సేకరిస్తారు. ఆ నూనెను ఆ వంశానికి చెందిన ఆడపడచు తాగడం ఇక్కడి ఆచారం..

 ఇలా చేస్తే ఖాందేవ్ దేవుడు తమ కుటుంబాలను, పాడిపంటలను చల్లగా చూస్తాడని వారి నమ్మకం.. ఒకసారి నూనె మొక్కును చెల్లించే ఆదివాసి మహిళ వరుసగా మూడేళ్లు ఈ మొక్కును చెల్లించాలి. ఈ జాతరకు తెలంగాణ నుంచి మాత్రమే కాక మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఆదివాసీలు తరలిస్తారు. రెండు రోజుల క్రితం ప్రారంభమైన ఈ జాతర ఈనెల 30 వరకు జరుగుతుంది.  

Leave a Comment