సచివాలయాల్లో రవాణా సేవలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సేవలైనా సత్వరం పొందేందుకు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇందులో బాగంగా రేషన్ కార్డు, పింఛన్లు, ఇళ్ల ఇలా అనేక సేవలను దరఖాస్తు చేసిన వెంటనే పొందే వెసులుబాటును కల్పించింది. 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా శాఖ సేవలను  సచివాలయాల ద్వారా పొందే సదుపాయాన్ని తీసుకొచ్చింది. రవాణా శాఖకు సంబంధించి ఆన్ లైన్ లో 83 సేవలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 54 సేవలను సచివాయాల ద్వారా అందించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 

గతంలో ఈ-సేవ, మీ-సేవ, కామన్ సర్వీస్ సెంటర్లలో వినియోగదారులు స్లాట్లు బుక్ చేసుకునే వారు. ఇప్పుడు సచివాలయాల్లోనే వాటిని పొందవచ్చు. 

కేవలం 15 నిమిషాల్లో కొన్ని సేవలను సచివాలయాల ద్వారా పొందే అవకాశం కల్పించింది. మరి కొన్ని సేవలను రెండు రోజుల్లో పొందవచ్చు. ఈ కింది చార్టును పరిశీలిస్తే ఏ సేవలకు ఎంత సమయం పడుతుంది, ఎన్ని రోజులు పడతాయో తెలుసుకోవచ్చు. 

Leave a Comment