ఎస్బీఐ కస్టమర్లు తమ ఖాతాను ఒక శాఖ నుంచి మరొక శాఖకు బదిలీ చేయాలనుకుంటున్నారు. అయితే దీని కోసం బ్యాంకు చుట్టు తిరగాల్సిన అవసరం లేదు. దీనిని మీ ఇంటి నుంచి ఆన్ లైన్ లో కూడా సులభంగా చేసుకోవచ్చు. మీ ఇంట్లో కూర్చొని మీ ఖాతాను ఒక బ్రాంచి నుంచి మరో బ్రాంచికి మార్చుకోవచ్చు. డిజిటలైజేషన్ మరియు ఇంటర్నెట్ ప్రపంచంలో ఎస్బీఐ తన ఖాతాదారుల సమయాన్ని వృథా చేయకుండా ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది.
దీని కోసం ఖాతా KYC తప్పనిసరి..
అయితే దీని కోసం కస్టమర్లు తమ ఖాతాకు KYC చేసి ఉండాలి. కస్టమర్లు తమ ఖాతాకు మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలి. మీ ఖాతాకు KYC మరియు మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉంటే కస్టమర్లు అందరూ తమ ఖాతాను ఇంటి నుంచే ఒక బ్రాంచి నుంచి మరొక బ్రాంచికి బదిలీ చేసుకోవచ్చు.
ఆన్ లైన్ లో ఖాతాను ఇలా బదిలీ చేయండి..
- నెట్ బ్యాంకింగ్ కోసం మొదట లాగిన్ అవ్వండి.
- మీరు లాగిన్ అయిన వెంటనే హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది.
- హోమ్ పేజీలో మీరు ఈ-సర్వీస్ పై క్లిక్ చేయాలి.
- ఎడమ వైపున ‘Transfer of Saving Account’ అనే ఆప్షన్ ఉంటుంది. దానిని క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు మరొక శాఖకు బదిలీ చేయాల్సిన ఖాతాను ఎంచుకోండి.
- తర్వాత మీరు మీరు బదిలీ చేయాల్సిన బ్రాంచ్ కోడ్ ను ఎంటర్ చేయాలి.
- దీని తర్వాత మీరు గెట్ బ్రాంచ్ పేరు యొక్క టాబ్ పై క్లిక్ చేయండి.
- దీని తర్వాత మీరు బ్రాంచ్, కోడ్ పేరును ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
- మీరు సబ్మిట్ పై క్లిక్ చేసిన వెంటనే సమచారాన్ని ధ్రువీకరించమని అడుగుతుంది.
- సమాచారం సరైనది అయినప్పుడు Confirm బటన్ పై క్లిక్ చేయండి.
- ఇలా చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది. దీనిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
- తర్వాత మీ ఖాతాను బదిలీ చేసిన బ్రాంచి గురించి పూర్తి సమాచారం ఓపెన్ అవుతుంది.
- దీంతో మీ ఖాతా ఆన్ లైన్ లో ఒక బ్రాంచి నుంచి మరొక బ్రాంచికి సులభంగా బదిలీ చేయబడుతుంది.