ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కాంపిటేటివ్ పరీక్షలకు శిక్షణ..!

కార్పొరేట్ కళాశాలల దీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల నిర్వహించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎంసెట్, జేఈఈఈ, ఐఐఐటీ వంటి కాంపిటేటివ్ పరీక్షలకు శిక్షణిచ్చేలా చర్యలు తీసుకోనున్నామన్నారు. ఇందుకు సంబంధించిన కార్యచరణ ప్రారంభించాలని సీఎం ఆదేశించారన్నారు. రాష్ట్రంలో పలు మండలాల్లో నేటికీ ప్రభుత్వ జూనియర్ కళాశాలు లేని విషయం సీఎం గుర్తించారన్నారు.

 రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలోనూ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. విద్యా రంగంలో అమలు చేస్తున్న నాడు-నేడు పథకాన్ని ఫేజ్-2, ఫేజ్-3లో జూనియర్, డిగ్రీ కళాశాలలు చేర్పించి, వాటి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారన్నారు. విద్యార్థుల నిష్పత్తి ఆధారంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. 

8వ తరగతి  నుంచే ఉపాధి శిక్షణలు….

ఎనిమిదో తరగతి నుంచే విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. లైఫ్ స్కిల్స్ కార్యక్రమాలపై ఎనిమిదో తరగతి నుంచే విద్యార్థులకు శిక్షణివ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. కంప్యూటర్ నిర్వహణ, హార్డవేర్ వంటి అంశాలపై ఈ శిక్షణా సాగాలన్నారని వెల్లడించారు. కడపలో వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజేత స్కూల్ మాదిరిగా రాష్ట్రంలో దివ్యాంగు విద్యార్థులకు విద్యా బోధన సాగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సమీక్షా సమావేశంలో నిర్ణయించామన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో విజేత స్కూల్ మోడల్ గా ప్రతి నియోజకవర్గంలోనూ రిసోర్స్ సెంటర్ ఏర్పాటు చేయనున్నామన్నారు. 

 

You might also like
Leave A Reply

Your email address will not be published.