కురిచేడులో విషాదం : శానిటైజర్ తాగి 12 మంది మృతి

ప్రకాశం జిల్లా కురిచేడులో విషాద ఘటన చోటుచేసుకుంది. శానిటైజర్ తాగి ఇప్పిటికీ 12 మంది ప్రాణాలు కోల్పోయారు.  కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో కురిచేడులో పది రోజులుగా మద్య దుకాణాలు మూతపడ్డాయి. వారికి మద్యం దొరక్కపోవడంతో పలువురు యాచకులు, స్థానికులు శానిటైజర్ తాగారు. ఈ ఘటనలో గురువారం రాత్రి వరకు ముగ్గురు మరణించగా, శుక్రవారం మరో తొమ్మిది మంది మరణించారు. 

మద్యానికి బానిసైన మృతులు.. మందు దొర్కపోవడంతో శానిటైజర్లు తాగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శానిటైజర్లు తాగడం వల్ల మృతి చెందారా లేక ఇంకేమైన తాగారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మార్చారీ వద్ద మృతదేహాలను పరిశీలించారు. ఎవరూ కూడా శానిటైజర్లు తాగవద్దని ఎస్పీ కోరారు.

Leave a Comment