2022లో ఎక్కువ కలెక్షన్లు సాధించిన టాప్ టెన్ తెలుగు మూవీస్..!

2022లో టాలీవుడ్ అద్భుత విజయాలతో దూసుకుపోతోంది.. బాలీవుడ్ తో పాటు మిగిలిన ఇండస్ట్రీలు పరాజయాలతో ఇబ్బందులు పడుతుండగా.. తెలుగు ఇండస్ట్రీ మాత్రం అత్యధిక వసూళ్లు సాధిస్తోంది. 2022లో ఎనిమిది నెలల కాలంలో టాలీవుడ్ సినిమాలు దేశవ్యాప్తంగా అభిమానులను అలరించాయి. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన టాలీవుడ్ టాప్ టెన్ చిత్రాలు ఏవంటే.. 

ఆర్ఆర్ఆర్ – 1200 కోట్లు:

యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్.. 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఇండియాలో దాదాపు 950 కోట్లు వసూలు చేయగా.. ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లను సాధించిన నాలుగో సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. 

సర్కారు వారి పాట – 230 కోట్లు:

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా సర్కారు వారి పాట.. 2022లో ఈ సినిమా 230 కోట్ల రూపాయలు వసూలు చేసి సెకండ్ హయ్యేస్ట్ గ్రాసింగ్ సినిమాగా నిలిచింది. 

భీమ్లా నాయక్ – 165 కోట్లు:

పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి హీరోలుగా నటించిన సినిమా భీమ్లా నాయక్.. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 165 కోట్ల రూపాయలు కలెక్షన్స్ సాధించింది. 

రాధేశ్యామ్ – 154 కోట్లు:

ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందింది. ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ప్రభాస్ కు ఉన్న క్రేజ్ కారణంగా భారీ ఓపెనింగ్స్ రాబ్టటింది. 154 కోట్ల రూపాయలు వసూలు చేసి ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో నాలుగో స్థానంలో నిలిచింది. 

ఎఫ్ 3 – 126 కోట్లు:

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా ఎఫ్ 3. ఈ సినిమా 126 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. 

నిఖిల్ కార్తికేయ 2 – 115 ప్లస్ కోట్లు

నిఖిల్ హీరోగా నటించిన సినిమా కార్తికేయ 2. చిన్న సినిమాల్లో అతి పెద్ద విజయాన్సి సాధించిన సినమాగా నిలిచింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 115 కోట్లు రూపాయల కలెక్షన్స్ సాధించింది. హిందీలోనే 30 కోట్లకు పైగా రాబట్టింది. 

సీతారామం – 80 కోట్లు

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా సీతారామం. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించాడు. పీరియాడికల్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా 80 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను సాధించింది. 

ఆచార్య – 76 కోట్లు

చిరంజీవి, రామ్ చరణ్ తొలిసారి కలిసి నటించిన సినిమా ఆచార్య. ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. దాదాపు 140 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా 76 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఈ సినిమాతో నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చాయి. 

బింబిసార – 75 కోట్లు

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించింది. అసలు ఈ సినిమా ఈ స్థాయిలో హిట్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. బింబిసార సినిమా వరల్డ్ వైడ్ గా 75 కోట్ల వసూళ్లను రాబట్టింది. 

 

Leave a Comment