నేడు కరోనా మహమ్మారి ‘పుట్టిన రోజు’..

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో వెలుగు చూసిన ఈ వైరస్ నేటికి ఏడాది పూర్తి చేసుకుంది. 2019 నవంబర్ 17న చైనాలోని హుబీ ప్రావిన్స్ లో మొట్టమొదటి కరోనా కేసును గుర్తించారు. వైరస్ పుట్టి ఏడాది పూర్తి చేసుకుని తన మొదటి పుట్టిన రోజును జరుపుకుంటోంది. కరోనా పుట్టిన నాటి నుంచి నేటి వరకు 55 మిలియన్ల కరోనా కేసులు నమాదుకాగా, ఇప్పటి వరకు 1.33 మిలియన్ల మంది కరోనాతో మరణించారు. 35.2 మిలియన్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. 

చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. అగ్ర దేశాలు సైతం కరోనా ధాటికి విలవిల్లాడాయి. కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసింది. కరోనాను అదుపు చేసేందుక లాక్ డౌన్ విధించినా సాధ్యపడలేదు. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ కోసం అనేక దేశాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని వ్యాక్సిన్ లు మూడో దశ ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.  

Leave a Comment