కరోనాకు దూరంగా ఉండాలంటే వీటికి దూరంగా ఉండాల్సిందే..!

ఈ కొత్త సంవత్సరం కూడా  కరోనా అందరికి భయము పుట్టిస్తా ఉంది. 2022 జనవరి 7న ప్రచురించిన ఓ అధ్యయనం “వైరస్ వాచ్ స్టడీ: నాన్-హౌస్‌హోల్డ్ యాక్టివిటీస్ కోవిడ్ రిస్క్, 2021 డిసెంబర్ 20′ అనే శీర్షికతో ప్రచురితమైన కాలంలో కోవిడ్ గురించి స్టడీ చేసింది. కొవిడ్ వ్యాప్తి ఈ పనులు చెయ్యడము వాళ్ళ ఎక్కువ అవుతుంది అవి ఏమిటి అంటే  షాపింగ్ చేయడం, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ని ఉపయోగించడం, పనికి వెళ్లడం వంటివి ముఖ్యమయినవి అని వైరస్ వాచ్ స్టడీ చేసిన పరిశోధనలో తెలిసింది. 2021వ సంవత్సరంలో సెప్టెంబర్ నుండి  నవంబర్ వరకు ఎటువంటి నిబంధనలు లేనప్పుడు కోవిడ్ -19 సెకండ్ వేవ్ ఈ అధ్యయనం జరిగింది. ఇందులో 16 సంవత్సరల కంటే ఎక్కువ వయస్సు ఉన్న జనాల ప్రవర్తనను లెక్కలోకి తీసుకున్నారు.

ఈ కొత్త సంవత్సరం 2022  మొదలు అయినప్పటి నుంచి కరోనా కేసులు,ఇంకా ఓమిక్రాన్ కేసుల పెరుగుదలను వాటి ఇన్ఫెక్షన్ వ్యాప్తిని భారత చూస్తుంది. సోమవారం, భారతదేశంలో 1,79,723 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కేసులలో దేశం సంఖ్య 4,003కి చేరుకుంది. COVID-19 ఇన్‌ఫెక్షన్‌లు మరింత పెరగకుండా నిరోధించడానికి, వ్యక్తులు ప్రమాదకర కార్యకలాపాలను గమనించాలి, వాటిని వీలైనంత ఎక్కువగా ఆచరించకుండా ఉండాలి. 

అధ్యయనం ప్రకారం, కరోనా వ్యాప్తిని పెంచిన ప్రమాదకర పనులు ఏమిటి అంటే ఏదో ఓకే పని కోసం బయటికి వెళ్లడం, డ్యూటీలుకు వెళ్లడం, ప్రజా రవాణాను ఉపయోగించడం, హోటల్లో తినడం, ఆటలు ఆడటం, ఇండోర్, అవుట్‌డోర్ కార్యకలాపాలకి వెళ్లడం,విందు వినోదంలో,పెళ్లిళ్లు, ఇలాంటి వాటిలో పాల్గొనడం, వారానికి రెండుసార్లు షాపింగ్ వెళ్లే వ్యక్తులు ఇతరులతో పోలిస్తే ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఎక్కువ ఉంది అని అధ్యయనం హెచ్చరించింది.

కరొనా వైరస్‌కి  వ్యాప్తి చెందకుండా మాత్రం నిరోధించడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించొచ్చు. అందుకోసం ఇలా చేయండి. ఎప్పటికప్పుడూ చేతులను సబ్బునీటితో కడగాలి. చేతలను కడగకుండా ముఖం, ముక్కు, నోటిని తాకొద్దు. అనారోగ్యంగా అనిపించినప్పుడు వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. మీ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోండి.

అధ్యయనం నుండి పొందిన డేటా ప్రకారం ఇంటి వెలుపల ఎవరితోనైనా షేర్ చేసిన కారును ఉపయోగించడం, ఇండోర్ రెస్టారెంట్, కేఫ్ లేదా క్యాంటీన్‌లో తినడం, ఇండోర్, అవుట్‌డోర్ పార్టీలకు వెళ్లడం వంటి గృహేతర బహిరంగ కార్యకలాపాలు కూడా దారితీస్తాయి. కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్‌ను ఒకరి నుంచి మరొకరికి ముందుకు తీసుకెళ్లని వివిధ కార్యకలాపాలపై కూడా ఈ అధ్యయనం వెలుగుచూసింది. 

సినిమాహాళ్లు, థియేటర్‌లు, కచేరీలు లేదా ఇండోర్ స్పోర్ట్స్ ఈవెంట్‌లు లేదా బ్యూటీ సర్వీస్‌లకు హాజరుకావడం వల్ల రిస్క్ పెరిగిందనడానికి మంచి ఆధారాలు లభించలేదని పేర్కొంది.మానవులలో ప్రవేశించిన కరొనా వైరస్‌కి ట్రీట్‌మెంట్‌కి ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ, ఇది వ్యాప్తి చెందకుండా మాత్రం నిరోధించడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించొచ్చు.

 

Leave a Comment