తిరుపతిలో ట్రాఫిక్ పోలీస్ వీరంగం.. వ్యక్తిని కాలుతో తన్నూతూ..!

తిరుపతిలో ట్రాఫిక్ పోలీస్ వీరంగం సృష్టించాడు.. ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తున్నాడన్న కారణంతో మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని కాళ్లతో తన్నుతూ దురుసుగా ప్రవర్తించాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం తిరుపతి అన్నమయ్య సర్కిల్ ప్రాంతంలో చోటుచేసుకుంది. 

రద్దీగా ఉండే అన్నమ్మయ్య సర్కిల్ వద్ద సిమెంట్ లోడ్ తో లారీ వచ్చింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ట్రాఫిక్ కి అంతరాయం కలుగుతుందని, లారీని పక్కకు తీయాలని చెప్పాడు. లారీలో వచ్చిన వ్యక్తి ఏం ఇబ్బంది లేదని అన్నాడు. ఈక్రమంలో కానిస్టేబుల్ కి ఆ వక్తికి మధ్య మాటమాట పెరిగి ఒకరినొకరు తోసేసుకున్నారు. 

దీంతో కానిస్టేబుల్ కి కోపం వచ్చింది. ఆ వ్యక్తిని కాలితో తన్నుతూ దురుసుగా ప్రవర్తించాడు. తనను కొట్టవద్దని ఆ వ్యక్తి బతిమాలినా వినిపించుకోలేదు. రోడ్డుపై కిందపడినా వదలకుండా కాలితో తన్నుతూ ఆవేశంతో ఊగిపోయారు. ట్రాఫిక్ పోలీస్ ప్రవర్తించిన తీరును అక్కడ ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది.    

Leave a Comment