దాంపత్య జీవితం సాఫీగా సాగాలంటే ఇలా చేయండి..!

దాంపత్య జీవితం సాఫీగా సాగాలంటే దంపతులిద్దరూ చిలకా-గోరింకల్లా ఉండాలి. ఇందుకు ఇద్దరూ ప్రేమగా, ఆప్యాయంగా సన్నిహితంగా మెలగాలి. అంతేకాదు భార్య భర్తలిద్దరూ కొన్ని అలవాట్లను అలవరుకుంటే వారి జీవితంలో సమస్యలను దూరం చేయవచ్చు. ఫలితంగా దంపతుల మధ్య ప్రేమ రెట్టింపై వారి అనుబంధం మరింత బలంగా ఉంటుంది. మరి అలాంటి కొన్ని అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

భార్యతో భర్త ఎలా ఉండాలి?

నవ్వుతూ ఇంట్లోకి రావాలి:

  • బయటి నుంచి ఇంటికి వచ్చినప్పుడు భర్త ముఖంలో నవ్వు ఉండాలి. చాలా మంది బయట స్నేహితులతో నవ్వుతూ గడుపుతారు.. గప్పాలు కొడతారు.. కాని ఇంటి వచ్చేసరికి చిరాకుగా ఉండటం.. భార్య, పిల్లలపై కోపంతో ఉండడం చేస్తుంటారు. అలా ఎప్పుడు చేయవద్దు. ఎన్ని టెన్షన్లు ఉన్నా ఇంట్లో చూపించకూడదు. ఎప్పుడు నవ్వుతూ ఇంట్లోకి రావాలి. భార్యకు ఓ స్మైల్ ఇవ్వాలి. 

భార్యను మెచ్చుకోండి:

  • భార్య మంచి పనులను మెచ్చుకోవాలి. చాలా మంది భర్తలు తమ భార్య చేసే తప్పులను మాత్రమే హైలెట్ గా చూపిస్తూ.. మంచి పనులు దాచేస్తుంటారు. అలా చేయవద్ద మీ భార్య చేసే మంచి పనులను పొగడండి..

పనుల్లో హెల్ప్ చేయండి:

  • మీ భాగస్వామి పనుల్లో హెల్ప్ చేయండి..వారికి తోడుగా పనుల్లో మీరు ఓ చేయి వేయండి..

గిఫ్ట్ ఇవ్వడం:

  • అప్పుడప్పుడు మీ భార్యకు గిఫ్ట్ ఇస్తూ సర్ ప్రైజ్ చేయండి.. గిఫ్ట్ అనేది చాలా ఖరీదైనదిగా ఉండాల్సిన అవసరం లేదు. మీ స్తోమతను బట్టి అప్పుడప్పుడు చిన్న గిఫ్ట్ ఇచ్చి సంతోషపరచండి..

ప్రేమను వ్యక్తపరచడం:

  • మీ భార్యపై మీకున్న ప్రేమను వ్యక్తపరచండి.. వారి కోసం సమయం కేటాయించి ప్రేమగా మాట్లాడండి.. ఇది భర్తకు చాలా ముఖ్యం.. 

సర్దుకుపోయే తత్వం:

  • సాధారణంగా భార్యాభర్తలిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు సహజం.. మాటా మాటా అనుకోవడం, గొడవ పడటం.. వంటివి జరుగుతుంటాయి. అలాంటప్పుడు భర్త సహనంగా ఉండాలి.. సర్దుకుపోవాలి. భార్య తన తప్పు తెలుసుకుని సారీ అడిగిప్పుడు ఆ గొడవల్ని మరిచిపోవడం బెటర్..

బెదిరించవద్దు..

  • చాలా మంది భర్తలు తమ భార్యలకు విడాకులు ఇస్తామని, రెండో పెళ్లి చేసుకుంటామని బెదిరిస్తూ ఉంటారు. ఇలా ఎప్పుడు చేయవద్దు. ఇలాంటి మీ పనులు మీ రిలేషన్ షిప్ ని దెబ్బతీస్తాయి. 

సమయం కేటాయించండి..

  • ప్రస్తుత బిజీ లైఫ్ లో చాలా మంది భార్యతో సమయం కేటాయించలేకపోతున్నారు. మీ సంతోషకర జీవితానికి భార్యకు సమయం కేటాయించడం చాలా ముఖ్యం. మీరు ఎంత బిజీగా ఉన్న ఆమెకు కొంత సమయం కేటాయించండి. కాసేపు ఆమెతో ముచ్చటించండి..

 నిందలు వేయవద్దు:

  • చాలా మంది పురుషులు తమ భార్యపై నిందలు వేస్తుంటారు. ఇలా ఎప్పుడు చేయవద్దు. నిందలు వేయడం వల్ల మీ దాంపత్య జీవితం ఎప్పుడూ సంతోషకరంగా ఉండదు. సో నిందలు వేయడం మానేయండి..
  • భార్య కుటుంబ సభ్యులతో మంచిగా ఉండండి.. భార్య ముందు వారి గురించి చెడుగా మాట్లాడకండి..

భార్య ఎలా ఉండాలి?

  • భర్తతో నమ్మకంగా ఉండండి.. నీతి నిజాయతీతో వ్యవహరించండి..
  • చాడీలు చెప్పేవారికి దూరంగా ఉండండి.. మీ భర్తపై, అత్తింటి వారిపై చెడు చెప్పే వారి మాటలు వినకండి.. వారిని దూరం పెట్టండి..
  • భర్తతో ప్రేమగా ఉండండి..
  • అత్తింటి వారితో మంచిగా ప్రవర్తించండి..
  • ఇంటిని నీట్ గా ఉంచండి..
  • భర్త ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తో, పుట్టింటి వారితో ఎక్కువసేపు ఫోన్లో గడపొద్దు..
  • ఖర్చు తగ్గించండి.. ఉదాహరణకు కొందరు భర్త జీతం రూ.20 వేలు ఉంటే.. రూ.25 ఖర్చు చేయిస్తుంటారు. తమకు అది కావాలి.. ఇది కావాలి.. అంటూ ఎక్కువ ఖర్చు పెట్టించవద్దు. ఉన్న  దాంట్లో సర్దుకుపోవడం అలవాటు చేసుకోండి.. 
  • జీవితంలో ఎవైనా సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు భర్తకు పూర్తి సహకారాలు అందించాలి.
  • చివరగా భర్త గాని, భర్త గానీ పరాయి పురుషులు, స్ట్రీలతో అక్రమ సంబంధాల జోలికి అస్సలు వెళ్లవద్దు.. ఇది మీ దాంపత్య జీవితానికి చాలా ప్రమాదకరం.. 

Leave a Comment