స్ఫూర్తి కథనం: బతకడమే కష్టమన్నారు.. ఆత్మవిశ్వాసంతో సక్సెస్ అయ్యాడు..!

ఆత్మవిశ్వాసం ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు.. ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని అధికమింస్తూపోతాడు. అదే లేకపోతే మాత్రం ఏమీ చేయలేడు. రెండు కాళ్లు, ఎడమ చేయి పోగొట్టుకున్నా.. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్న ఓ వ్యక్తి అందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అతడే హర్యాణాలోని ఝుజ్జార్ కి చెందిన తిన్ కేస్ కౌశిక్.. 

కౌశిక్ ఓ చురుకైన పిల్లవాడు.. 2002లో ఓ రోజు కౌశిక్ గాలిపటం ఎగురవేస్తుండగా.. అతడి గాలిపటం హైటెన్షన్ వైర్ లో చిక్కుకుంది. అప్పుడు కౌశిక్ కి తొమ్మిదేళ్లు.. కౌశిక్ తన గాలిపటాన్ని తీసుకునే క్రమంలో విద్యుత్ షాక్ కి గురయ్యాడు. ఎడమ చేయి, రెండు కాళ్లు కోల్పోయి.. కోలుకోలేని విధంగా కాలిపోయాడు.. 

అతను బతికే అవకాశమే లేదని వైద్యులు చెప్పారు. కానీ అతని తల్లిదండ్రులకు మాత్రం కచ్చితంగా బతుకుతాడనే నమ్మకం ఉండేది. చివరికి ఆ నమ్మకమే గెలిచింది. మూడు సంవత్సరాల పాటు కౌశిక్ ని కంటికి రెప్పలా చూసుకున్నారు. ఆ తర్వాత తన అమ్మ సహాయంతో స్కూల్ కి వెళ్లడం మొదలుపెట్టాడు. 

ఆ రోజుల్లో కనీసం స్నేహితులతో కూడా ఆడుకోలేని పరిస్థితి.. అయితే కౌశిక్ కి తన స్నేహితులు చిన్న చూపు చూడలేదు. తనకు మద్దతుగా ఉన్నారు. ఆ తర్వాత కౌశిక్ కి కృత్రిమ కాలు పెట్టించారు తల్లిదండ్రులు.. వాటి సహాయంతో తనకు తానుగా కాలేజీకి వెళ్లాడు. డిగ్రీ పూర్తి చేసుకున్నాడు. కౌశిక్ మాత్రం శారీరక శ్రమ లేకపోవడంతో బరువు పెరిగిపోయాడు.. దీంతో ఫిట్ నెస్ పై దృష్టి పెట్టాడు.

గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన 2 కి.మీ. మారథాన్ లో కౌశిక్ పాల్గొన్నాడు. ఆ వీడియో వైరల్ గా మారడంతో హైదరాబాద్ కి చెందిన ఆదిత్య మెహతా ఫౌండేషన్ ప్రోస్థటిక్ లెగ్స్ ని స్పాన్సర్ చేసింది. అప్పటి నుంచి కౌశిక్ ఫిట్ నెస్ ట్రైనర్ కావాలని గోల్ పెట్టుకున్నాడు. లక్ష్యాన్ని సాధించేందుకు ఎన్నో కష్టాలు పడ్డాడు. 

ఓ ఫిట్టర్ వద్ద స్విమ్మింగ్ నుంచి సైక్లింగ్ వరకు శిక్షణ తీసుకున్నాడు. ఆ సమయంలో ఎన్ని బాధలు పడ్డాడు. తర్వాత వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన ఫిట్టర్ ట్రాన్స్ ఫర్ మేషన్ ఛాలెంజ్ లో పాల్గొన్నాడు. ఐసిఎన్-ఇండియాకు అథ్లెట్ అంబాసిడర్ గా నియామకమయ్యాడు. లద్దాఖ్ లో దివ్యాంగుల కోసం ఫిట్ నెస్ క్లాసులు కూడా నిర్వహించాడు.. ఫిట్ నెస్ ట్రైనర్ కావాలనే తన కలను నెరవేర్చుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్వతారోహణ చేయాలనేది కౌశిక్ కల.. 

  

 

 

Leave a Comment