దిగజారిన Tik Tok రేటింగ్స్..

గూగుల్ ప్లేప్టోర్ లో Tik Tok రేటింగ్ దిగజారిపోయింది. ప్రముఖ యూట్యూబర్ క్వారీమినాటి మద్దతుదారులు మరియు ఫైజల్ సిద్ధిఖీ వివాదాస్పద వీడియో ద్వారా గూగుల్ ప్లేస్టోర్ లో Tik Tok రేటింగ్స్ 4.5 స్లార్ నుంచి 1.3 స్టార్ కు పడిపోయింది. ఆపిల్ యాప్ స్టోర్ లోనూ 3.8 స్టార్ రేటింగ్ కు దిగజారింది. 

దీనిక ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి. ప్రముఖ యూట్యూబర్ క్వారీమినాటి తన చానెల్ లో ‘YouTube Vs TikTok : The End’ పేరుతో ఒక వీడియో పెట్టాడు. ఈ వీడియోలో అతను టిక్ టోకర్లను రోస్టెడ్ చేస్తూ వీడియో పోస్టు చేశాడు. అయితే ఈ వీడియోపై Tik Tok యూజర్లు మండిపడ్డారు. ఈ వీడియోపై అభ్యంతరం చేస్తూ యూట్యూబ్ లో కంప్లయింట్లు చేశారు. దీంతో యూట్యూబ్ ఆ వీడియోను తొలగించింది. 

ఈ వివాదానికి మొత్తం కారణం Tik Tok పాపులర్ స్టార్ ఫైజల్ సిద్ధిఖీ యాసిడ్ దాడులను కీర్తిస్తున్నట్లు వీడియో పోస్టు చేయడమే. ఇలాంటి వీడియో పోస్టు చేసినందుకు ఫైజల్ అకౌంట్ ను Tik Tok నిలిపివేసింది. ఫైజల్ కు Tik Tokలో 13 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. 

 చాలా రోజుల నుంచి ఇండియాలో Tik Tok బాన్ చేయాలని విమర్శకుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో #IndiaAgainstTik Tok వంటి హ్యాష్ ట్యాగ్ లు ట్రెండింగ్ లో ఉన్నాయి. దీంతో యాప్ స్టోర్ లో Tik Tok రేటింగ్ రాబోయే రోజుల్లో మరింత దిగజారే అవకాశం ఉంది.

Tik Tokను ఇండియాలో నిషేధించాలని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖ శర్మ కూడా పిలుపునిచ్చారు. అభ్యంతరకమైనే వీడియోలను కలిగి ఉండటమే కాకుండా యువతను పెడదోవ పెట్టించే వీడియోలు Tik Tokలో పోస్టు చేస్తున్నారంటే మండిపడ్డారు. 

Leave a Comment