గూగుల్ ప్లేస్టోర్ నుంచి టిక్ టాక్ అవుట్..

చైనీస్ యాప్లను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే..ఈ నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే అత్యంత ప్రాముఖ్యత పొందిన చైనా యాప్ టిక్ టాక్ ను గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాయి. దేశ భద్రత, రక్షణ దృష్ట్యా ఈ యాప్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. 

అయితే చైనా ప్రభుత్వంతో సహా ఏ విదేశీ ప్రభుత్వంతోనూ భారతదేశంలోని వినియోగదారుల డేటాను లీక్ చేయలేదని టిక్ టాక్ ఇండియా స్పష్టం చేసింది. 

Leave a Comment