బీజేపీ ఐటీ సెల్ నా నంబర్ లీక్ చేసింది.. చంపేస్తామని నుంచి బెదిరింపులు : హీరో సిద్ధార్థ్ 

తమిళనాడు బీజేపీ ఐటీ సెల్ నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు హీరో సిద్ధార్థ్ ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ సెల్ తన పర్సనల్ మొబైల్ నెంబర్ లీక్ చేసిందని, దీంతో తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామని, తమపై అత్యాచారం చేస్తామని బెదిరింపు మెసేజ్ లు వస్తున్నాయని సిద్ధార్థ్ పేర్కొన్నారు. 

ఈ విషయాన్ని సిద్ధార్థ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తమిళనాడు బీజేపీ ఐటీ సెల్ తన మొబైల్ నంబర్ లీక్ చేసిందన్నారు. అందువల్ల గడిచిన 24 గంటల్లో తనకు దాదాపు 500 అసభ్య సందేశాలు వచ్చాయన్నారు. తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామని, తమపై అత్యాచారం చేస్తామని బెదిరిస్తూ మెసేజ్ లు వచేస్తున్నారని పేర్కొన్నారు. 

ఈ నంబర్లన్నీంటిని రికార్డ్ చేశానని, వీటిలో చాలా వరకు బీజేపీతో లింక్ ఉన్నవి, ఆ పార్టీ గుర్తు డీపీగా పెట్టుకున్నవే ఉన్నాయని తెలిపారు. వీటన్నింటినీ పోలీసులకు అందించానని, తాను మౌనంగా ఉంటానని మాత్రం అనుకోవద్దని స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితుల దృష్ట్యా సిద్ధార్థ్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని పలుమార్లు ప్రశ్నించాడు. దీంతో ఇప్పుడు తన ఫోన్ నంబర్ ను అక్కడి బీజేపీ ఐటీ విభాగం వాళ్లు ఉద్దేశ్య పూర్వకంగా బయటపెట్టారని సిద్ధార్థ్ ఆరోపించారు. 

Leave a Comment