ఈసారి..సైన్స్ ఫిక్షన్ తో ప్రభాస్…!

బాహుబలి, సాహోతో ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. ఈ సారి ప్రభాస్ ప్రయోగంతో ముందుకు వస్తున్నాడా? అంటే అవుననే తాజా సమాచారం. ప్రభాస్ 21వ సినిమా సైన్స్ ఫిక్షన్ మూవీ అని తెలుస్తోంది.  దీనికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నారు. ఈ సినిమాని యువి క్రియేషన్స్ సంస్థ పాన్ ఇండియా కేటగిరీలోనే తెరకెక్కిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన లీకులు అంతకంతకు వేడిక్కిస్తున్నాయి. తాజాగా ఓ ఈవెంట్లో దర్శకుడు నాగ్ అశ్విన్ స్వయంగా ప్రభాస్ 21 వివరాలు అందించారు. ఈసారి ప్రభాస్ ఓ సైన్స్ ఫిక్షన్ కథాంశంలో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ కథాంశమే అయినా రియలిస్టిక్ గా ఉంటుంది. దాదాపు 200 కోట్ల బడ్జెట్ ని ఖర్చు చేయనున్నామని నాగ్ అశ్విన్ తెలిపారు. ఈ సినిమాకు కథానాయికా ఎవరన్నది ఇంకా ఫైనల్ కాలేదు. చిత్రీకరణకు ముందు నటీనటుల వివరాలు వెల్లడిస్తాం అని వెల్లడించారు. 

అయితే ప్రస్తుతం ప్రభాస్ ‘జిల్’ ఫేమ్ రాధాక్రిష్ణ డైరెక్షన్ లో ఓ పీరియాడికల్ లవ్ స్టోరీలో నగిస్తున్నాడు. ఈ సినిమాకు ‘రాధేశ్యామ్’, ‘ఓ డియర్’ అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి. కాకపోతే మూవీ షూటింగ్ పదే, పదే వాయిదా పడటం..డార్లింగ్ ఫ్యాన్స్ కు కోపం తెప్పిస్తోంది. అదీ కాక రిలీజైన ప్రీ లుక్ కూడా అభిమానులకు పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేదు. 

Leave a Comment