జాతీయ యువజన దినోత్సవం వెనక ఉన్న అసలు కథ ఇదే..!

భారతదేశం ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు.అలాంటి మన భారతదేశంలో పుట్టిన ఓక గొప్ప ఆధ్యాత్మిక నాయకులు, దేశ భక్తుడు, మాటలతో మంత్రముగ్దులను చెయ్యగలిగే గొప్ప వక్త ” స్వామి వివేకానంద ” గారు. ఈయిన జీవించింది కేవలం 39 సంవత్సరాలే అయ్యినప్పటికీ మరొక 1000 సంవత్సరాలు పూర్తి అయినా కూడా చెరిగిపోని ముద్ర వేశారు. అలాంటి గొప్ప వ్యక్తి, మహనీయుడి గురించి,తెలుసుకుందాం.స్వామి వివేకానంద జన్మదినం నేడు. స్వామి వివేకానంద గారి గౌరవార్థం ఆయన జన్మించిన తేదీ అయిన జనవరి 12న జాతీయ యువజన దినోత్సవంగా జరగాలని స్వాతంత్రం వచ్చిన కొన్ని సంవత్సరాలకు 1985లో భారత ప్రభుత్వం ప్రకటించింది. 

స్వామి వివేకానంద గారు 1863 సంవత్సరం జనవరి 12వ తేదీన మకర సంక్రాతి రోజున ఒక బెంగాలీ కుటుంబంలో కలకత్తాలో జన్మించారు. స్వామి వివేకానంద గారి నాన్నగారు న్యాయవాదిగా  వృత్తిలో ఉన్నారు. వివేకానంద గారి చిన్నప్పటి పేరు ఎమిటి అంటే “నరేంద్ర నాధ్ దత్తా”. వివేకానందా గారు తన బాల్యం నుంచే ఆటలలో, చదువులో, చాలా చురుగ్గా ఉండేవారు.  ఈయనని ఏకసంథాగ్రాహిగా అందరూ అంటారు.  వివేకానంద  జ్ఞాపకశక్తి చాలా బాగుండెది. 1880 లో మెట్రిక్యులేషన్ పరీక్ష ఉత్తీర్ణుడై ఆ తర్వాత తత్వశాస్త్రం, పాశ్చాత్య శాస్త్రాలను పూర్తి చేశారు వివేకానందా గారు.

చిన్ననాటి నుంచే ఆయన ఆధ్యాత్మికత వైపు మొగ్గుచూపారు. చాలా చిన్న వయస్సులోనే ఆయనే ధ్యానాన్ని అభ్యసించారు. కొన్నాళ్ల పాటు ఆయన బ్రహ్మ సమాజ ఉద్యమంలోనూ పాల్గొన్నారు. గొప్ప దేశభక్తుల్లో ఒకరిగా నిలిచి, భారతీయ వేదాంతాలు, యోగా శాస్త్రాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేశారు. స్వామి వివేకానందా గారి నాన్న పేరు రామకృష్ణ. ఆయన తండ్రి చనిపోవడముతో కుంగిపోయినప్పటికీ భారతదేశంలోని ప్రతి భాగాన్ని తెలుసుకునేందుకు, అన్వేషించేందుకు సుదీర్ఘ యాత్రకు ప్రయాణము అయ్యారు స్వామీజీ. 

నిజమైన కర్మయోగి అయిన స్వామికి దేశ యువతపై అపార విశ్వాసం ఉండేది. తమ కఠిన శ్రమ, అంకితభావం, ఆధ్యాత్మిక శక్తితో భారతదేశ తలరాతను మార్చే శక్తి యువతకు ఉందని ఆయన బలంగా నమ్మారు. స్వామి గారు ఎక్కువగా యువతరం కోసము ఎంతో అరటపడేవారు. భారతదేశ భవిష్యత్తుని మార్చగలిగేది యువతేనని. యువత ఒక మంచి ఆశయంతో ముందుకు వెళ్లాలని ఆయన అనేవారు. అందుకే “డబ్బు లేని వాడు కాదు జీవితంలో ఒక ఆశయం అంటూ లేని వాడు అసలైన పేదవాడు అంటారు”వివేకానంద. 

ఆయన ఎప్పుడు కూడా “గొర్రెలలా కాదు సింహంలా ధైరంగా బ్రతకమని” దేనికి భయపడవద్దని అంటారు”ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన కొంతమంది యువకులను నాకు అప్పగిస్తే ఈ దేశం స్వరూపాన్నే మార్చేస్తాను” అని స్వామీజీ తరచూ చెప్పేవారు. ఎల్లపుడు అందరూ ఆత్మవిశ్వాసం కలిగి ఉండేలా ఆయన యువతలో స్ఫూర్తిని  తన ప్రసంగాలతో నింపెవరు.మనల్ని ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా బలహీనపరిచే దేనినైనా విషతుల్యంగా భావించి తిరస్కరించాలని స్వామి వివేకానంద నమ్మేవారు.

 

Leave a Comment