రోడ్డుపై వెళ్తుండగా ఉన్నట్టుండి పేలిన పోన్.. వైరల్ వీడియో..

చైనాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా స్మార్ట్ ఫోన్లు చార్జింగ్ లో ఉండగా పేలోపోతాయి. కానీ చార్జింగ్ లో లేకుండానే ఓ వ్యక్తి బ్యాగులో ఫోన్ పేలింది. దీంతో చుట్టుపక్కల వారు షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఒక యువకుడు పక్కన మరో అమ్మాయితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా తన బ్యాగులోంచి పెద్ద శద్దంతో మంటలు వచ్చాయి. దీంతో ఆ యువకుడు తన బ్యాగ్ ను విసిరేసి అక్కడి నుంచి తప్పుకున్నాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే యువకుడి చేయి, జుట్టు, కనురెప్పలు స్వల్పంగా కాలాయి. ఆ స్మార్ట్ ఫోన్ 2016లో శాంసంగ్ ఫోన్ అని బాధితుడు చెప్పాడు.  

Leave a Comment