ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బిర్యానీ ఇదే..!

సాధారణంగా ఎక్కడైనా బిర్యానీ రూ.100 నుంచి రూ.1000 వరకు ఉంటుంది. ఇంకా ఆ బిర్యానీలో ఉన్న ఐటమ్స్ ను బట్టి ఇంకాస్తా ఎక్కువ ఉండొచ్చు. కానీ దుబాయ్ లోని ఓ రెస్టారెంట్ లో బిర్యానీ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. దుబాయ్ లోని బాంబే బరో అనే రెస్టారెంట్ లో లభించే బిర్యానీ ధర రూ.19,700 ఉంటుంది. 

‘రాయల్ గోల్డ్ బిర్యానీ’ పేరుతో ఈ బిర్యానీని రెస్టారెంట్ లో అమ్ముతున్నారు. పేరుకు తగ్గట్టే 23 క్యారెట్ల తినే బంగారంతో గార్నిష్ చేసి దీన్ని వండిస్తారు. అందుకే దీన్ని గోల్డ్ బిర్యానీ అంటారు. అందుకే ఇంత ఎక్కవ ధర ఉంటుంది. ప్రపంచంలోనే ఇది అత్యంత ఖరీదైన బిర్యానీ  అని నిర్వాహకులు చెబుతున్నారు. ఆర్డరిస్తే 45 నిమిషాల్లో రెడీ చేస్తారట..

అంతే కాకుండా ధరకు తగ్గట్టుగానే ఈ బిర్యానీకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మామూలుగా బిర్యానీలో ఒకేరకమైన రైస్ ఉంటుంది. కానీ రాయల్ గోల్డ్ లో మాత్రం బిర్యానీ రైస్, కీమా రైస్, వైట్ రైస్, సాఫ్రాన్(కుంకుమ పువ్వు)రైస్ ఉంటాయి. దీని బరువు దాదాపు 3 కిలోలు ఉంటుంది. 

దీంతో పాటు బంగారం రేకుల్లో చుట్టిన కశ్మీరీ లాంబ్ సీక్స్ కబాబ్స్, రాజ్ పుత్ చికెన్ కబాబ్స్, ఢిల్లీ లాంబ్ చాప్స్, మొగలాయ్ కోఫ్తా, మలాయ్ చికెన్ రోస్ట్ కూడా ఉంటాయి. బిర్యానీపై బంగాళాదుంపలు, జీడిపప్పు, గుడ్లు, దానిమ్మ, పుదీనాలతో ఎంతో కలర్ ఫుల్ గా, అందంగా దీన్ని తిర్చిదిద్దుతారు. బిర్యానీతో పాటు నిహారీ సలాన్, జోధ్ పురి సలాన్, బాదామి సాస్, బాదం, దానిమ్మ రైతా, పలు రకాల సాస్ లు , కూరలు రైటాస్ కూడా వడ్డీస్తారు. అంతే కాదు బిర్యానీ సర్వ్ చేసే రెస్టారెంట్ సిబ్బంది కూడా బంగారు పూత కలిగిన డ్రెస్ కోడ్ ను ధరిస్తారట..

 

Leave a Comment