భారత్ లో థర్డ్ వేవ్ ముప్పు..బూస్టర్ డోసు ప్రారంభం..!

ఈ కొత్త సంవత్సరంలో అయినా కరోనా భయము తగ్గుతుంది అని అనుకునేలోపే మళ్లీ అంతటా కోవిడ్‌ గురించే చర్చ జరుగుతోంది. థర్డ్‌ వేవ్‌ ముప్పుతో అందరిలో మళ్లీ ఆందోళన మొదలైంది. వాక్సిన్ వేసుకున్న  కూడా కొందరు కోవిడ్‌ వైరస్‌  బారిన పడుతూనే ఉన్నారు. కరోనావైరస్‌ మళ్లీ మళ్లీ సోకుతూనే ఉంది. రోగనిరోధక శక్తి  చాలా తక్కువగా ఉన్నవారు, ఇతర వ్యాధులతో ఇబ్బందిపడేవారిలోనే ఇది ఎక్కువగా కనిపిస్తోంది. వీరికి కోవిడ్‌ బూస్టర్ డోస్  అవసరం చాలా ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో భారత్ మరో  మెట్టు ఎక్కింది.  

ఒమిక్రాన్ సహా పాత డెల్టా ఇతర వేరియంట్లు దేశంలో కలకలం రేపుతున్న సమయంలో కొవిడ్ వ్యాక్సిన్ మూడో డోసు పంపిణీని ప్రభుత్వాలు చేపట్టాయి. జనవరి 10, సోమవారం నుంచి దేశవ్యాప్తంగా అర్హులు అందరికీ కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు పంపిణీ మొదలైంది. మహమ్మారిపై పోరులో ఫ్రంట్ లైన్ వారియర్లుగా భావించే ఆరోగ్య కార్యకర్తలు, భద్రతా, పోలీస్ దళాలతోపాటు 60 ఏళ్లు పైబడిన వారు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ బూస్టర్ డోసు పొందేందుకు అర్హులు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న ఐదు రాష్ట్రాల్లోని ఈసీ సిబ్బందిని సైతం ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించి మూడో డోసును అందింస్తారు. 

బూస్టర్ డోసు పొండానికి అర్హులైన వారిలో 1.05 కోట్ల మంది ఆరోగ్య కార్యకర్తలు, 1.9 కోట్ల మంది ఫ్రంట్‌లైన్ కార్మికులు, ఇతర తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న 60 ఏళ్లు పైబడిన 2.75 కోట్ల మందిని అర్హులుగా గుర్తించామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఎవ్వరు అయ్యితే బూస్టరు డోస్ కి అర్హులుగా వున్నారో వారి  యొక్క  ఫోన్ నంబర్‌కు కోవిన్ పోర్టల్ దగ్గర నుంచి ఎస్ఎంఎస్  వస్తాయి అని ఆరోగ్య మంత్రి మాండవీయ చెప్పారు.రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్న తొమ్మిది నెలలు లేదా 39 వారాల వ్యవధి ఉన్న వారికి బూస్టర్ డోస్ ఇస్తారు. బూస్టరు డోస్ కోసము కొత్తగా కోవిన్ పోర్టల్‌లో మరోసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పని లేదు. ఎలాగూ ఇప్పటికే రెండు డోసులు పొందారు కాబట్టి ప్రిస్కిప్షన్స్, మెడికల్ హిస్టరీకి సంబంధించి పేపర్లు చూపించకుండానే ముసలి వాళ్లు కూడా మూడో డోసును వేసుకోవచ్చు.

భారత్ లో కరోనా మూడో వేవ్ కొనసాగుతోన్న దరిమిలా కొత్త కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఆదివారం ఒక్కరోజే 1.6లక్షల కేసులు, 327 మరణాలు నమోదయ్యాయి. జనవరి చివరి వారం నాటికి రోజువారీ కొత్త కేసులు 2.5లక్షలకు చేరొచ్చనే అంచనాలున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు జనం కదలికలపై ఆంక్షలు విధించాయి. మన ప్రధాని నరేంద్ర మోదీ  డిసెంబర్ 24న  మాట్లాడుతూ, బూస్టర్ డోసు, పిల్లలకు టీకాల పంపిణీపై ప్రకటన ఇచ్చారు.   జనవరి 1 నుంచి 15 ఏళ్లు పైబడిన పిల్లలకు వ్యాక్సిన్లు  ఇస్తారు.  సోమవారం నుంచి బూస్టర్ డోసుల పంపిణీ కూడా ప్రారంభమైనది.

 

Leave a Comment