గుండె ఆరోగ్యానికి.. ఈ కూరగాయలు ఎంతో మేలు..!

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిలో ఒత్తిడి.. టెన్షన్.. దీనికి తోడు చాలా మందిలో మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు అధికమయ్యాయి. దీంతోపాటు మన ఆహారపు అలవాట్లు.. మన శరీరంలో చాలా వ్యాధులకు కారణం మన ఆహారపు అలవాట్లే.. ఇవి ముఖ్యంగా గుండె జబ్బులకు కారణమవుతున్నాయి. 

ప్రతి రోజూ ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం.. నాన్ వెజ్ అధికంగా తీసుకోవడం వల్ల రోగాలు అధికమవుతున్నాయి. అయితే ఆహారంలో కూరగాయలను అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.. ప్రతి రోజూ కూరగాయలను తీసుకోవడం వల్ల మీ గుండెను పదికాలలు పదిలంగా ఉంచుకోవచ్చు. ఆ కూరగాయలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • బ్రోక్లీ.. ఇది చూడటానికి కాలిఫ్లవర్ లా కనిపిస్తుంది. బ్రోక్లీ గుండెకు చాలా మంచిది. ఇందులో ప్రోటీన్లు, కాల్షియం, కెరోటిన్, కార్బోహైడ్రేట్లు, ఐరన్, విటమిన్ ఎ వంటి న్యూట్రియంట్స్ ఉంటాయి. బ్రోక్లీని సూప్, కూర లేదా సలాద్ రూపంలో తీసుకోవచ్చు. 
  • ఇక రెండోది పాలకూర.. ఇది కూడా అనేక పోషక పదార్థాలతో నిండి ఉంటుంది. ఇందులో ఐరన్, ప్రోటీన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఫోలెట్ వంటి పోషకాలు ఉంటాయి. ఇది ఎన్నో రోగాల నుంచి మనల్ని కాపాడుతుంది. 
  • క్యారెట్.. ఇందులో విటమిన్ సీతో పాటు ఐరన్, సోడియం, పొటాషియం, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, విటమన్ ఎ, బీ6 ఉంటాయి. క్యారెట్ ని రోజువారీ ఆహారంలో చేర్చితే.. మీ గుండెను ముప్పు నుంచి కాపాడుతుంది. 
  • బెండకాయ.. ఇందులో ఫైబర్, బీటా కెరోటిన్, విటమిన్ ఎ, పొటాషియం, కాల్షియం, కార్బోహైడ్రేట్స్ మెండుగా ఉంటాయి. బెండకాయ తినడం వల్ల గుండెకు సంబంధించిన రోగాలు రాకుండా ఉంటాయి. 
  • వెల్లల్లి.. దీనిని నిత్యం మన వంటకాల్లో ఉపయోగిస్తుంటాం. వెల్లుల్లి తీసుకుంటే చాలా రకాల సంక్రమల నుంచి తప్పించుకోవచ్చు. ఇందులో ఉన్న ఎలిసిన్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. రక్తం క్లాట్ కాకుండా కాపాడుతుంది. 

Leave a Comment