ప్రపంచాన్ని శాసించేది ఈ మూడే.. ‘హిట్ రిఫ్రెష్’ బుక్ లో మైక్రో సాఫ్ట్ సీఈవో..!

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదేళ్ల ‘హిట్ రిఫ్రెష్’ అనే పుస్తకం రాసిన విషయం తెలిసిందే. ఈ పుస్తకం 2017 సెప్టెంబర్ 26న విడుదలైంది. సత్యనాదేళ్ల ‘హిట్ రిఫ్రెష్’ పుస్తకంలో తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. రానున్న సంవత్సరాల్లో మిక్స్ డ్ రియాలిటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రపంచ రూపు రేఖలను మార్చే టెక్నాలజీలుగా మారుతాయని అభిప్రాయపడ్డారు. మిక్స్ డ్ రియాలిటీని హైబ్రిడ్ రియాలిటీగా కూడా చెబుతారని, రియల్, వర్చువల్ టెక్నాలజీల కలయిక ఇదని, కంప్యూటింగ్ ఇప్పటి వరకు మనిషి ఆధారితంగానే మెరుపడగా, అంతిమంగా కంప్యూటింగ్ అనుభవం మిక్స్ డ్ రియాలిటీగానే ఉండబోతుందన్నారు. 

అంతేకాదు తాను రాసిన హిట్ రిఫ్రెష్ బుక్ లో సత్య నాదేళ్ల 1960 నాటి ఆటగాడైన జయసింహా గురించి ప్రస్తావించారు. చిన్న పిల్లాడిలా కనిపించే ఈ హైదరాబాదీ క్రికెటర్ అంటే తనకెంతో ఇష్టమని తెలిపారు. అతడి స్టయిల్ నాకెంతో ఇష్టమన్నారు. మైక్రో సాఫ్ట్ కు ఏదో ఒక కంపెనీ ముగింపు పలుకుతుందని కొంత మంది అన్నారని, కానీ అది జరగలేదని వివరించారు. మైక్రోసాఫ్ట్ తన స్థానాన్ని కాపాడుకునేందుకు ఏదో ఒకటి తప్పకుండా చేస్తుంది పేర్కొన్నారు. 

 

Leave a Comment