గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించే ముఖ్యమైన సేవలు ఇవే..

ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఎన్ని సర్వీసులు అందిస్తున్నారు..అవి ఏంటనేవి మనలో చాలా మందికి తెలియదు. ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 11 ప్రభుత్వ శాఖలకు చెందిన 540 సర్వీసులను ప్రజలకు అందిస్తోంది. సచివాలయాల్లో చాలా సర్వీసులకు కేవలం రూ.15 చార్జీలు వసూలు చేస్తారు. కొన్నింటికి వేరు వేరు చార్జీలు ఉన్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించే కొన్నిముఖ్యమైన సర్వీసుల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

సచివాలయంలో అందించే సర్వీసులు ఏవీ?

సచివాలయంలో 2 రకాల సర్వీసులు అందిస్తారు. 

  1. మీసేవ సర్వీసులు
  2. నాన్ మీసేవ సర్వీసులు

మీ సేవ సర్వీసులు..

మీ సేవ సర్వీసుల్లో భాగంగా ఏం సర్వీసులు అందిస్తారు..సర్వీసుకు ఎంత ఛార్జ్ చేస్తారో ఇక్కడ తెలుసుకుందాం..

  • ఆధార్ ekyc – రూ.15
  • CDMA(మున్సిపల్ సర్వీసెస్) – చైల్డ్ బర్త్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్ లో పిల్లల పేర్లు చేర్చడం, డెత్ సర్టిఫికెట్, బర్త్ మరియు డెత్ సర్టిఫికెట్లలో కరెక్షన్స్ – రూ.65
  • వికలాంగులకు సదరం సర్టిఫికెట్ స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ ప్రింట్ చేయడం.
  • రిజిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ – EC కాపీ, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ యొక్క సర్టిఫైడ్ కాపీ.
  • సోషల్ వెల్ఫేర్ – ఫ్రెష్, రెన్యువల్ స్కాలర్ షిప్ అప్లయి, జ్ఞాన భూమి స్టూడెంట్ బయోమెట్రిక్ తీసుకోవడం.
  • రైతులకు – 1బి, కంప్యూటరైస్డ్ అడంగల్ సర్టిఫికెట్లు, అగ్రికల్చర్ ఇన్ కమ్ సర్టిఫికెల్ – రూ.15
  • రెవెన్యూ సర్వీసెస్ – Income సర్టిఫికెట్, Caste సర్టిఫికెట్, పట్టాదారు పాస్ బుక్, FMB కాపీ, లీగల్ హెయిర్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ – రూ.15

నాన్ మీసేవ సర్వీసెస్..

  • కొత్త రేషన్ కార్డు అప్లయి, రేషన్ కార్డులో మెంబర్ యాడ్ చేయడం.
  • రైతు భరోసాకు అప్లయి చేయడం, అమౌంట్ పడిందో లేదో స్టేటస్ చెక్ చేయడం.
  • నిరుద్యోగులకు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ APSSDCలో నమోదు చేసుకోవచ్చు. 
  • APSRTC స్టూడెంట్ బస్ పాస్ అప్లయి చేయడం, టికెట్ రిజర్వేషన్ చేసుకోవచ్చు. 
  • వైఎస్సార్ పెళ్లి కానుక సర్టిఫికెట్ డౌన్ లోడ్, అప్లికేషన్ స్టేటస్ చూడవచ్చు.
  • ప్రజాసాధికార సర్వే స్థితి తెలుసుకోవచ్చు. 
  • రవాణాకు సంబంధించి లెర్నింగ్ లైసెన్స్ LLRకి స్లాట్ బుకింగ్, డ్రైవింగ్ లైసెన్స్ లో అడ్రస్ మార్పు, రెన్యువల్ సర్వీసెస్
  • ఓటర్ ఐడీ కార్డు అప్లికేషన్స్
  • ఎలక్ట్రిక్ మీటర్ కనెక్షన్
  • తిరుపతి మరియు ముఖ్యమైన దేవాలయాల రూమ్స్ బుకింగ్

ఇలా ఇంకా మరెన్నో సేవలు మన సచివాలయంలో అందుబాటులో ఉన్నాయి. ప్రజలు అందరు మన సచివాలయంలో సేవలను ఉపయోగించుకోండి. 

Leave a Comment