కరోనా రోగులకు అందించాల్సిన ఆహారం, మందులు ఇవే..!

ప్రాణాంతక కరోనా వైరస్ రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రతి రోజు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తలను లక్షణాలను బట్టి ఐసోలేషన్ లేదా హోం క్వారంటైన్ కు వైద్యులు సూచిస్తున్నారు. ఇంట్లో హోం క్వారంటైన్ లో ఉన్నప్పుడు తీసుకునే ఆహారం విషయంలో మరియు మందుల విషయంలో జాగ్రత్త వహించాలని వైద్యులు చెబుతున్నారు. 

అయితే హోం క్వారంటైన్ లో ఉన్న సమయంలో ఇంట్లో ఉండే వచ్చే వారికి కూడా కరోనా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇంట్లో వారు కూడా కోవిడ్ రోగులకు ఇచ్చే షెడ్యూల్ ఛార్జ్ ను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. 

ఐసోలేషన్ వార్డుల్లోని రోగులకు అందించే ఆహారం..

 • అల్పాహారంగా ఉదయం 6.30 గంటలకు పొంగల్, ఇడ్లీ, వడ, కిచిడీ, ఉప్మా అందిస్తారు. ఓ అరగంట తరువాత కషాయం తాగాలి.
 • మధ్యాహ్నం ఒంటి గంటకు పప్పు, సాంబారు, పెరుగు, కోడి గుడ్డు, అరటి పండుతో భోజనం
 • సాయంత్రం 4 గంటలకు రాగి జావ, ఖర్జూరం, బాదం పప్పు
 • రాత్రి 7.30 నుంచి 8.30 గంటల మధ్య పప్పు, సాంబారు, చపాతీ, పూరీ, ఇడ్లీ, దోశ, పెరుగు, అన్నం, కోడి గుడ్డు అందజేస్తారు. 

నిత్యం పాటించాల్సిన జాగ్రత్తలు

 • జ్వరం ఉందో లేదో థర్మా మీటర్ తో రోజుకు మూడు సార్లు చూసుకోవాలి.
 • పల్స్ ఆక్సీమీటర్ ద్వారా ఆక్సీజన్ లెవెల్స్ ను రోజుకు మూడు సార్లు చూసుకోవాలి.
 • వైద్యులు సూచించిన పౌష్టికాహారంతో పాటు పండ్లు తీసుకోవాలి.
 • రెండు వారాలపాటు విటమిన్-సి 500 ఎంజీ ఒక ట్యాబ్లెట్ రోజుకు రెండుసార్లు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి(తిన్న తర్వాత)
 • విటమిన్-డీ ఒక ట్యాబ్లెట్ రోజుకు ఒకసారి ఉదయం తిన్న తర్వాత
 • మల్టీ విటమిన్ – జింక్ ఒక ట్యాబ్లెట్ రోజుకు రెండు సార్లు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి(భోజనం తర్వాత)
 • పారాసిటమాల్ 500 ఎంజీ లేదా 650 ఎంజీ రోజుకు రెండు సార్లు(ఉదయం ఒకటి, రాత్రి ఒకటి భోజనం తర్వాత)
 • జలుబు ఉంటే రోజుకు ఒకసారి సిట్రిజన్ మాత్ర.
 • అజిత్రోమైసిన్ 500 ఎంజీ ఒక మాత్ర రోజుకు ఒకసారి రాత్రి తిన్న తర్వాత ఐదు రోజులు వాడాలి.
 • హైడ్రాక్సీక్లోరోక్విన్ 200 ఎంజీ రోజుకు రెండు సార్లు 
 • విరేచనాలు ఉంటే తగ్గేందుకు స్పోరోలాక్ డీఎస్ టాబ్లెట్ రోజుకు రెండు సార్లు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి తిన్న తర్వాత.
 • గ్యాస్, కడుపులో మంట తగ్గేందుకు ఫాంటాసిడ్ డీఎస్ఆర్ రోజుకు ఒక మాత్ర ఉదయం తినకముందు.

రోగనిరోధక శక్తి పెంచేందుకు..

 • ప్రతి రోజు ఉదయం 10 గ్రాముల చ్యవన్ ప్రాస్ తీసుకోవాలి.
 • హెర్బల్ టీ, తులసి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, శొంఠి, బెల్లం వేసి బాయిల్ చేసిన అందులో నిమ్మరసం కలిపి తాగాలి.
 • రోజుకు రెండు సార్లు ఎండు ద్రాక్ష తినాలి.
 • వేడి పాలలో చిటికెడు పసుపు వేసి తాగాలి.
 • ప్రతి రోజు వేడి నీళ్లు తాగాలి.
 • వంటకాల్లో పసుపు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి వినియోగించాలి.
 • నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె ఒక స్పూన్ నోట్లో వేసుకుని 30 సెకన్ల పాటు పుక్కిలించి ఉమ్మివేయాలి.
 • రోజూ అరగంట పాటు యోగా, ప్రాణాయామం చేయాలి.
 • మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి.
 • ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
 • ఇంకా జ్వరం, దగ్గు లేదా శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది ఉంటే వెంటనే కోవిడ్ కేర్ సెంటర్ కు సంప్రదించాలి. 

 

Leave a Comment