రాత్రి పూట ఈ ఆహారాలు తింటే కలిగే నష్టాలు ఇవే..!

ఎప్పుడు చేసే పని అప్పుడే చేసేయాలంటారు పెద్దలు.. అది తిండైనా లేదా వేరే పని అయినా.. ఈరోజుల్లో ప్రజల జీవనశైలి మారిపోయింది. దీంతో ఆహారం తీసుకునే వేళల్లో మార్పులు వచ్చేశాయి. వేళ కాని వేళల్లో ఆహారం తీసుకుంటున్నారు. అయితే ఇలా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా హానికరమని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు అనారోగ్యానికి కారమవుతాయట. మరీ రాత్రి సమయంలో ఏ ఫుడ్స్ తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..  

ప్రస్తుతం చాలా మంది నైట్ షిఫ్ట్ లు చేస్తున్నారు. ఈ సమయంలో టైమ్ పాస్ కోసం లేదా నిద్ర లేకపోవడం వల్ల కలిగే ఆకలితో పలు రకాల స్నాక్స్, ఇతర ఆహార పదార్థాలను తింటున్నారు. ఈ సమయంలో ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. 

ఇక రాత్రి సమయంలో తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ రాత్రి సమయంలో తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తే చిప్స్, బిస్కెట్లు, స్వీట్స్ లేదా హాట్ వంటి స్నాక్స్ ఐటమ్స్ తీసుకోవద్దని సూచిస్తున్నారు. లైట్ లిక్విడ్స్ ఒకటి లేదా రెండు సార్లు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. 

ఈ విషయంపై అమెరికా సైంటిస్టులు పరిశోధన చేశారు. ఆరోగ్యంగా ఉన్న 12 మంది పురుషులు, 7 మంది స్త్రీలను ఒక నెల రోజుల పాటు వేర్వేరు వేళల్లో ఫుడ్ ఇచ్చారు. దీంతో వారి జీవిన శైలి పూర్తిగా మారిపోయింది. రాత్రి సమయంలో ఆహారం తీసుకున్న వారి శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరిగిపోయింది. అందుకే సమయానికి తిండి తినడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. రాత్రి సమయంలో ఆయిల్ ఫుడ్స్, చిప్స్, పిజ్జాలు, స్వీట్స్, నూడిల్స్, బిస్కెట్స్ వంటివి తీసుకుంటే హార్ట్ డిసీస్, డయాబెటీస్ వంటి రోగాల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

Leave a Comment