పబ్జీకి ప్రత్యామ్నాయ గేమ్స్ ఇవే..!

పబ్జీకి ఇండియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే, ఇటీవల భారత్-చైనా సరిహద్దు వద్ద జరిగిన ఘర్షణల కారణంగా పబ్జీ మొబైల్, పబ్జీ మొబైల్ లైట్ ను భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. మొదటిసారి బ్యాన్ చేసిన 59 యాప్ లలో పబ్జీ లేనప్పటికీ తర్వాత రద్దు చేసిన 118 యాప్ ల జాబితాలో దీనిని చేర్చారు. పబ్జీ లేకపోయినప్పటికీ దానిని పోలిన గేమ్స్ కోకొల్లలుగా ఉన్నాయి. పబ్జీకి ప్రత్యామ్నాయంగా ఉన్న కొన్ని గేమ్స్ ను మీకోసం అందిస్తున్నాం. వాటిని మన దేశంలో నిరభ్యంతరంగా ఆడుకోవచ్చు. 

CALL OF DUTY MOBILE

ఇండియాలో పబ్జీకి ఇదో మంచి పత్యామ్నాయం. 2019 అక్టోబర్ లో రిలీజ్ అయిన ఈ గేమ్ మొబైల్ వెర్షన్ భారత్ లో విజయవంతమైంది. ఇందులో కూడా బ్యాటిల్ రాయల్ మోడ్ ఉంది. ఇది ఫస్ట్ పర్సన్ షూటర్ గేమ్. భారీ మ్యాప్స్, ఆధునిక ఆయుధాలు, జాంబీస్ వంటివన్నీ ఇందులో ఉంటాయి. 

BLACK SURVIVAL

10 మంది కలిసి ఆడగలిగే ఈ బ్లాక్ సర్వైవల్ గేమ్ లో 22 యుద్ధ భూములు ఉంటాయి. నిర్ణీత సమయంలో శత్రువుల నుంచి తప్పించుకుంటూ వాళ్లను అంతమొందించాలి. ఎదురుదాడి చేయడానికి 600కు పైగా విభిన్న ఆయుధాలు ఉంటాయి. 

RULES OF SURVIVAL

RULES OF SURVIVAL

 పబ్జీకి చాలా దగ్గరగా ఉండే గేమ్ ఇది. కాపీ రైట్స్ విషయంలో ఈ గేమ్ పై పబ్జీ ఫిర్యాదు కూడా చేసింది. ఇందులో అత్యధికంగా ఒకేసారి 300 మంది ఆడవచ్చు. ఈ ఒక్క విషయంలో మాత్రమే పబ్జీకి, దీనికి వ్యత్యాసం ఉంది. 

KNIVES OUT

అత్యధికంగా 100 మంది వరకు ఆడగలిగే వైవ్స్ ఔట్ కూడా పబ్జీకి మంచి ప్రత్యామ్నాయం. ఫస్ట్-పర్సన్ యాక్షన్ గేమ్ ఫార్మాట్ లోనే ఈ ఆటను కూడా డిజైన్ చేశారు. దీనిని ఆడటానికి మొబైల్ లో కేవలం 600 ఎంబీ స్పెస్ ఉంటే చాలా.

FREE FIRE

యుద్ధం చేసే విధానాలు, పబ్జీతో పాటు ఫ్రీ ఫైర్ లోనూ ఒకేలా ఉంటాయి. ఇందులో ఒకసారి 10 నిమిషాల పాటు సాగే గేమ్ లో అత్యధికంగా 50 మంది ఆడవచ్చు. ప్లేయర్ ఔట్ ఫిట్ ను అందంగా మలచుకోవడానికి అనేక ఆప్షన్స్ ఉంటాయి. ఈ గేమ్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ లలో లభిస్తుంది. 

SCARFALL

ఈ గేమ్ ని అచ్చమైన భారతీయ కంపెనీ తయారు చేసింది. అంతర్జాతీ ప్రమాణాలతో తయారైన ఈ గేమ్ లో పూర్తిగా స్వదేశీ సాంకేతికతను వాడారు. పబ్జీని పోలి ఉండే ఈ దేశీ యాప్ ఇప్పటికే  చాలా సార్లు అప్డేట్స్ ఇచ్చి కొత్త మ్యాప్స్, యానిమేషన్స్ వంటివి యాడ్ చేసింది. దేశంలోని మెట్రో నగరాలను ఎంచుకొని ఆట ఆడవచ్చు. 

FAU-G

మోడీ ఆత్మనిర్భర్ భారత్ ఆకాంక్షలో భాగంగా తయారు చేసిన యాప్ ఇది. భారతీయ నేపథ్యం, దేశ సరిహద్దుల్లోని పరిస్థితులను కళ్లకు కట్టేలా ఈ యాప్ ను డిజైన్ చేశారు. దీని ద్వారా వచ్చే ఆదాయంలో 20 శాతం భారత్ కే వీర్ ట్రస్ట్ కు వెళ్తుంది. ఈ గేమ్ కు ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ మెంటార్ గా వ్యవహరిస్తున్నారు. 

Leave a Comment