ఎన్నికలు నిర్వహిస్తామంటే ఊరుకునేది లేదు : కొడాలి నాని

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ సిగ్గు లేకుండా, చంద్రబాబు రాసిన లేఖలకు స్పందిస్తూ ఎన్నికలను నిర్వహించాలనుకోవడం సిగ్గుచేటన్నారు. 

కోవిడ్ తీవ్రత దృష్ట్యా ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా లేరన్నారు. నిమ్మగడ్డకు రాజ్యాంగ వ్యవస్థలపై, రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదన్నారు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న నిమ్మగడ్డ చిల్లర రాజకీయాలు చేయకుండా, రిటైర్ అయ్యే లోపు హుందాగా వ్యవహరించాలన్నారు. 

ప్రస్తుత కోవిడ్ తీవ్రత దృష్ట్యా బ్యాలెట్ పద్ధతిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం వైరస్ వ్యాప్తి కారణమవుతుందని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. వయసు వచ్చిన బుద్ధి జ్ఞానం లేకుండా కోవిడ్ కేసులు తీవ్రత ఉన్న నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహిస్తామనడం అవివేకమన్నారు. హైదరాబాద్ లో కూర్చునే అజ్ఞాతవాసి నిమ్మగడ్డ రమేష్, జూమ్ బాబు లు ఇద్దరు కలిసి ప్రజలకు నష్టం కలిగించేలా ఎన్నికలు నిర్వహిస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. 

 

Leave a Comment