ఆ నర్సు ఇంట్లో 500పైగా హైక్వాలిటీ కండోమ్స్.. 150 మందితో అఫైర్..!

తమిళనాడులోని తేనీ జిల్లా పప్పమ్మల్ పురంలో ఓ నర్సు హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో భాగంగా పోలీసులు ఆమె ఇంట్లో పరిశీలించగా.. 500పైగా కండోమ్స్ లభించాయి. ఇంకా మరిన్ని ఊహించని ట్విస్టులు ఎదురయ్యాయి.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తేని జిల్లా అండిపట్టి ప్రభుత్వ హాస్పిటల్ లో సెల్వి(43) సీనియర్ నర్సుగా పనిచేసేది. ఆమె భర్త సురేష్ దిండిగుల్ క్యాటరింగ్ సర్వీస్ చేస్తుండేవాడు. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. 

అయితే సెల్వి, సురేష్ కి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకొని వేర్వేరుగా ఉన్నారు. పిల్లలు తండ్రి సురేష్ వద్దే ఉండిపోగా.. సెల్వి అండిపట్టిలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఒంటరిగా ఉంటోంది. అదే ఇంట్లో గతేడాది నవంబర్ 24న సెల్వి దారుణ హత్యకు గురైంది. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు ఆమె ఇంటిని పరిశీలించారు. అక్కడ 500 పైగా హైక్వాలిటీ కండోమ్స్ లభించాయి. 

ఇంకా ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయగా.. విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. సెల్వికి దాదాపు 150 మంది పురుషులతో అఫైర్ ఉన్నట్లు తేలింది. ఆమె అఫైర్ నడిపినవారిలో చాలా మంది ప్రముఖులు ఉన్నట్లు తెలిసింది.. ఈక్రమంలో గతేడాది డిసెంబర్ 9న కంబం గవర్నమెంట్ హాస్పిటల్ లో పనిచేసే రామచంద్రప్రభు(34) అనే వ్యక్తికి ఈ హత్య కేసుతో సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. దీంతో ఆ వ్యక్తిని విచారణకు రావాల్సిందిగా సమన్లు పంపారు. 

అయితే మరుసటి రోజే రామచంద్రప్రభు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతేకాదు సెల్వి హత్యకు ముందు వీరిద్దరు కలుసుకున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు రామచంద్ర భార్యను విచారించగా.. వారిద్దరి మధ్య అఫైర్ ఉందని, తరచుగా సెల్వికి డబ్బులు ఇచ్చేవాడని అతని భార్య చెప్పింది. ఆ తర్వాత సెల్వి ఇంట్లో ఉన్న ఫుట్ మార్క్స్ ఆధారంగా రామచంద్ర ఈ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. డబ్బు విషయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగి ఉండవచ్చని, ఈక్రమంలో అతడు హత్య చేసి ఉంటాడని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. తనను అరెస్ట్ చేస్తారన్న భయంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు తెలిపారు.   

 

Leave a Comment