దారుణం : నడిరోడ్డుపై యువతిని కాల్చి చంపారు..

ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలపై దాడులు ఆగడం లేదు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు, దాడులకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. తాజాగా హర్యానాలో దారుణం జరిగింది.  ఓ యువతిని నడిరోడ్డుపై కాల్చి చంపారు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనం సృష్టిస్తుంది. 

వివరాల మేరకు హర్యానాలోని ఫరీదాబాద్ లో కాలేజీ నుంచి వస్తున్న నిఖిత తోమర్(21) అనే యువతిని ఇద్దరు దుర్మార్గులు కారులో కిడ్నాప్ చేయాలని ప్రయత్నించారు. దానికి ఆమె ప్రతిఘటించింది. దీంతో ఆమెపై కాల్పులు జరిపి ఇద్దరు పారిపోయారు. ఆ యువతి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీనికి సంబంధించిన విజువల్స్ సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రధాన నిందితుడు తౌసీఫ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

రెండేళ్ల కిందటే 2018లో బాధితురాలి కుటుంబం నిందితుడిపై కిడ్నాప్ కేసు వేసింది. అయితే అది చర్చలతో ముగియడంతో వదిలేశారు. అనంతరం రెండేళ్ల తర్వాత యువతి ప్రాణాల మీదికే వచ్చింది. కాగా ఈ ఘటనపై భారీ ఆగ్రహం చెలరేగింది. బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలంటూ డిమాండ్ చేశారు. 

 

Leave a Comment