‘శుభలగ్నం’ సీన్ రిపీట్.. రూ.1.5 కోట్లకు భర్తను అమ్మేసింది..!

మీకు 1990లలో వచ్చిన శుభలగ్నం సినిమా గుర్తుందా.. ఆ సినిమాలో జగపతిబాబును రోజాకు కోటి రూపాయలకు అమ్మేస్తుంది ఆమని.. తాజాగా రూ.1.5 కోట్లకు భర్తను మరో మహిళకు అమ్మేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో సంచలనంగా మారింది. వివరాల మేరకు తన తండ్రి ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తరచూ తన తల్లితో గొడవ పడుతున్నాడంటూ ఓ బాలిక భోపాల్ పోలీస్ స్టేషన్ లో ఇటీవల ఫిర్యాదు చేసింది.

వీరిద్దరి గొడవల వల్ల ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయిందని తెలిపారు. దీని వల్ల తాను. తన చెల్లెలు చదువు మీద ధ్యాస పెట్టలేకపోతున్నామని పేర్కొన్నారు. పోలీసులు ఈ కేసును భోపాల్ ఫ్యామిలీ కోర్డుకు తరలించారు. దీంతో కోర్టు బాలిక తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చింది. ఈ కౌన్సిలింగ్ లో బాలిక తండ్రికి మరో మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్లు వెల్లడైంది. 

అతను తన ప్రియురాలితోనే ఉండాలని భావిస్తున్నట్లు చెప్పాడు. తనకు విడాకులు కావాలని కోరాడు. దీనికి భార్య మొదట అంగీకరించలేదు. ఆ తర్వాత ఓ షరతుపై విడాకులకు అంగీకరించింది. తన భర్తతో ఉండాలంటే తనకు ఇల్లు, 1.5 కోట్ల రూపాయల డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీనికి తన భర్త ప్రియురాలు అంగీకరించింది. బిడ్డల భవిష్యత్తు కోసం డబ్బులు డిమాండ్ చేశానని అతని భార్య చెప్పుకొచ్చింది.   

 

You might also like
Leave A Reply

Your email address will not be published.