రాజది ఆత్మహత్యగానే నిర్ధారించిన పోలీసులు.. మృతదేహాన్ని ఊళ్లోకి రానివ్వని గ్రామస్థులు..!

సైదాబాద్ ఆరేళ్ల చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. వరంగల్ జిల్లా ఘట్ కేసర్ రైల్వే ట్రాక్ వద్ద రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే రాజు మృతిపై పలు వార్తలు వచ్చాయి. రాజును పోలీసులే చంపినట్లు అతడి తల్లి, భార్య ఆరోపణలు చేశారు. అయితే రాజుది ఆత్మహత్యే అని పోలీసులు నిర్ధారించారు.

మృతదేహానికి డాక్టర్లు రజా మాలిక, ఫోరెన్సిక్ వైద్యుడు వరంగల్ ఎంజీఎం రాజు పోస్టు మార్టం చేశారు. మృతదేహంపై రైలు గుద్దిన గాయాలు, గ్రీజు ఉన్నాయని వైద్యులు తెలిపారు. రైల్వే ప్రమాదం గాయాలను గుర్తించినట్లు చెప్పారు. మృతదేహంపై ఇతర గాయాలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించినట్లు చెప్పారు. పోస్టుమార్టం ప్రక్రియను వీడియోగ్రఫీ చేసినట్లు తెలిపారు. డీఎన్ఏ టెస్టు కోసం రాజు ఎముకలు సేకరించినట్లు చెప్పారు. రాజు మత్తు పదార్థాలు తీసుకున్నాడా అనేది పరిశీలిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.

ఊళ్లో రానివ్వని గ్రామస్థులు:

పోస్టుమార్టం అనంతరం రాజు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాజు మృతదేహన్ని మొదట అతడి స్వగ్రామం ఆత్మకూరు మండలం అడ్డగూడూరుకు తీసుకెళ్లాలని భావించారు. కానీ, ఆ గ్రామస్తులు మృతదేహాన్ని ఊళ్లోకి రానిచ్చేందుకు నిరాకరించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో భారీ పోలీసు బందోబస్తు నడుమ వరంగల్ లోనే అంతిమ సంస్కారం నిర్వహించారు. కుమారుడి చితికి తల్లి వీరమ్మ నిప్పటించారు. ఆ సమయంలో భార్య కూడా హాజరయ్యారు. 

Leave a Comment