భార్యను కారులో వదిలి వెళ్లిన భర్త.. భార్యతో పాటు కారు దొంగతనం..!

దొంగలు ఓ భర్తకు షాక్ ఇచ్చారు. భార్యతో పాటు కారును తీసుకెళ్లిపోయారు. ఈ ఘటన పంజాబ్ లోని డేరా బస్సిలో గురువారం చోటుచేసుకుంది. వివరాల మేరకు డేరా బస్సికి చెందిన రాజీవ్ చంద్, రీతు దంపతులు తమ పిల్లల స్కూల్ ఫీజ్ చెల్లించడానికి స్కూలుకు వచ్చారు. భార్య రీతును కారులోనే ఉంచి స్కూల్ ఫీజ్ చెల్లించేందుకు వెళ్లాడు రాజీవ్..

కారు తాళం కూడా అలాగే ఉంచాడు. ఇది గమనించిన ఇద్దరు దొంగలు చొరబడ్డారు. ఒకరు డ్రైవింగ్ సీటులో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. మరోకరు రీతు నోరును గుడ్డతో మూసేశాడు. కారు స్టార్ చేసి ఎంచక్కా తీసుకెళ్లిపోయారు. దాదాపు ఐదు కిలో మీటర్లు వెళ్లిన తర్వాత రీతును ఓ చోట కిందకు తోసేశారు.

 స్కూల్ నుంచి బయటకు వచ్చిన రాజీవ్ కారు కనిపించకపోయే సరికి కంగారు పడ్డాడు. రీతుకు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో రాజీవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రీతు మాత్రం కొన్ని గంటల తర్వాత ఇంటికి చేరుకుంది. దీంతో రాజీవ్ ఊపిరి పీల్చుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

 

Leave a Comment