వైఎస్సార్ లేకపోవడంతోనే రాష్ట్రం ముక్కలు..ఆర్టీసీ ఎండీ ఆసక్తికర వ్యాఖ్యలు..!

ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి లేకపోవడంతోనే రాష్ట్రం రెండు ముక్కలైందని చెప్పారు. సీఎం కొడుకును పొలిటికల్ ఇంట్రస్ట్ వల్లే జైల్లో పెట్టారని తెలిపారు. వైఎస్ హయాంలో తాను ఐటీ శాఖ కార్యదర్శిగా పని చేశానన్నారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో కొందరు అధికారులను బదిలీ చేసిన ఫైల్స్ పై విచారణ జరిగిందన్నారు. తనను మాత్రం విచారించలేదన్నారు. అది తన ఇంటిగ్రిటి అని చెప్పారు. ఇక తన బదిలీని ప్రభుత్వం విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తానని పేర్కొన్నారు. 

ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ప్రతాప్ ను ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో రవాణాశాఖ కార్యదర్శి క్రిష్ణబాబుకు ఆర్టీసీ వీసీ అండ్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతాప్ ను ఎపీఎస్పీ బెటాలియన్ల అడిషన్ డీజీగా బదిలీ చేసింది. 

ఈ సందర్భంగా మాదిరెడ్డి ప్రతాప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం వైఎస్సార్ చనిపోయినప్పుడు హెలికాప్టర్ లో సుబ్రహ్మణ్యం బదులు రచ్చబండకు తాను వెళ్లాల్సి ఉందన్నారు. సుబ్రహ్మణ్యం తొలుగ తనను వెళ్లమని అడిగారని, దానికి తాను సరే అని అన్నానని చెప్పారు. మళ్లీ ఆయనే వద్దనటంతో తాను ఆగిపోయాయని ప్రతాప్ పేర్కొన్నారు. ఇది తనకు పునర్జన్మగా భావిస్తున్నట్లు చెప్పారు. 

 

Leave a Comment